Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

RRR Movie: ఆర్ఆర్ఆర్ సినిమా డబ్బింగ్ పనులను కోసం తారక్ ఎన్ని రోజులు కేటాయించారో తెలుసా?

RRR Movie: ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ రేపు (మార్చి 25) ప్రేక్షకుల ముందుకు

By Ramesh Babu

Published on: March 23, 2022 1:57 PM

Updated on: March 24, 2022 12:56 PM

do-you-know-how-many-days-tarak-has-spend-for-rrr-movie-dubbing-work

---Advertisement---

RRR Movie: ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ రేపు (మార్చి 25) ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ క్రమంలోనే పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు. అలాగే వివిధ రాష్ట్రాలలో పెద్దఎత్తున ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు.

pjimage 2022 03 23T135818.886ఈ విధంగా చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొని సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తూ ప్రేక్షకులలో సినిమాపై భారీ అంచనాలు పెరిగేలా చేశారు. ఇకపోతే తాజాగా రాజమౌళి ఈ సినిమా గురించి ఎన్టీఆర్ గురించి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ఈ సినిమాలో తారక్ కొమరంభీం పాత్రలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ పాత్రలో నటించిన ఎన్టీఆర్ ఈ పాత్రకు డబ్బింగ్ చెప్పడానికి ఎన్ని రోజులు సమయం తీసుకున్నారనే విషయాన్ని వెల్లడించారు.

Advertisement

ఈ సినిమాకి డబ్బింగ్ చెప్పడానికి తారక్ తెలుగులో ఒక రోజు మాత్రమే కేటాయించారు. కేవలం ఒకే ఒక రోజులో డబ్బింగ్ పనులన్నింటిని పూర్తి చేసుకున్నారు. అలాగే హిందీలో రెండు రోజులు, తమిళంలో మూడు రోజుల పాటు ఈ సినిమాకి సమయం కేటాయించారని రాజమౌళి ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఇకపోతే ఎన్టీఆర్ ఈ సినిమాలో కొమరంభీమ్ పాత్రలో నటించగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో ప్రేక్షకులను సందడి చేయనున్నారు. గత మూడు సంవత్సరాల నుంచి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న అభిమానుల కల రేపటితో తీరనుంది.

, , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

RELEATED POSTS :