...

Niharika : మరోసారి జిమ్ లో రచ్చ చేసిన నిహారిక.. ఫోటోలు వైరల్!

Niharika : నిహారిక ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మెగా వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నిహారిక పెద్దగా ఆశించిన ఫలితాలను అందుకోలేక పోయారు. దీంతో జొన్నలగడ్డ వెంకట చైతన్య అనే వ్యక్తిని వివాహం చేసుకుని వైవాహిక జీవితంలో స్థిరపడ్డారు. అయితే ఈమె తరువాత పలు వివాదాలు ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.గతంలో తన జిమ్ ట్రైనర్ తో కలిసి ఉన్న వీడియోని షేర్ చేయగా,ఈ వీడియో కారణంగా ఎంతో నెగిటివిటీ ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో నిహారిక ఏకంగా తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేశారు.

Advertisement
Niharika
Niharika

అదే విధంగా ఈ విషయం గురించి మరిచిపోకముందే మరోసారి ఈమె పబ్ రైడింగ్ లో పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఈ విధంగా నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తున్న నిహారిక సోషల్ మీడియా వేదికగా నెటిజన్లకు టార్గెట్ అయ్యారు. ఈ క్రమంలోనే ఏ మాత్రం అవకాశం దొరికినా నిహారికను పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. ఇకపోతే తాజాగా ఈమె తన భర్తతో కలిసి జోర్డాన్ ట్రిప్ ఎంజాయ్ చేసిన సంగతి మనకు తెలిసిందే ఈ ట్రిప్ కి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

Advertisement

ఇదిలా ఉండగా తాజాగా నిహారిక మరోసారి జిమ్ లో తన భర్త చైతన్యతో కలిసి సందడి చేశారు. ఈ క్రమంలోనే ఈ జిమ్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తన జిమ్ ట్రైనర్ మరొక కొత్త జిమ్ సెంటర్ ప్రారంభించగా నిహారిక, చైతన్య కలిసి జిమ్ సెంటర్ ను సందర్శించినట్లు తెలుస్తోంది ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఫోటోలను షేర్ చేస్తూ తన ట్రైనర్ కు కంగ్రాట్స్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
Read Also : Niharika konidela: భర్తకు లిప్ లాక్ ఇస్తూ… మా బంధం శాశ్వతమైందంటూ నిహారిక పోస్ట్..!

Advertisement
Advertisement