Telugu NewsEntertainmentSamantha : సమంతను టార్గెట్ చేస్తూనే.. చైతన్య ఆ డైలాగ్ కొట్టాడా...!

Samantha : సమంతను టార్గెట్ చేస్తూనే.. చైతన్య ఆ డైలాగ్ కొట్టాడా…!

Samantha : ఒకప్పటి టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ సమంత, నాగ చైతన్యల ప్రేమాయణం, పెళ్లి, విడాకులు… ఇలా ఎలాంటి వార్తైనా ప్రేక్షకుల్లో తెగ ఆసక్తిని పెంచింది. అయితే నాలుగేళ్ల పెళ్లి జీవితానికి బైబై చెప్పిన ఈ ఇద్దరూ… ప్రస్తుతం వరుస ఆఫర్లతో దూసుకెళ్తున్నారు. అయితే విడాకుల తర్వాత చై… ఇదంతా జరిగిన తర్వాత కూడా మేము చాలా సంతోషంగానే ఉన్నామని తెలిపాడు. అయితే అటు సామ్ తన లైఫ్ లో బిజీగా గడుపుతుండగా… చైతన్య కూడా వరసు సినిమాల్లో నటిస్తున్నారు.

naga-chaithanya-thnk-you-movie-dialogue-for-sam-or-not
naga-chaithanya-thnk-you-movie-dialogue-for-sam-or-not

ప్రస్తుతం నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన థాంక్యూ సినిమా టీజర్ రిలీజ్ అయింది. అయితే ఇందులో రాశి ఖన్నా, అవికా గోర్, మాళవిక హీరోయిన్లుగా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇటీవలే విడుదల అయింది. ఆకట్టుకునే విధంగా ఉండటంతో… ఈ టీజర్ విడుదల అయిన కాసేపట్లోనే తెగ వైరల్ అయింది. ఇందులో చై చెప్పిన డైలాగ్ మాత్రం సామ్ కోసమేనా అంటూ తెగ కామెంట్లు వస్తున్నాయి. అందులో లైఫ్ లో కాంప్రమైజ్ అయ్యేదే లేదు… ఎన్నో వదులుకుని ఇక్కడిదాకా వచ్చాను.. అంటూ నాగ చైతన్య చెప్పిన డైలాగ్ అందరినీ ఆకట్టుకుంటోంది.

Advertisement

Read Also : Samantha Ruth Prabhu : సమంతను ఒంటరిగా చనిపోవాలన్న నెటిజన్‌.. సామ్‌ షాకింగ్ రిప్లయ్..!

Advertisement
RELATED ARTICLES

తాజా వార్తలు