...

Karthika Deepam: మోనిత అరెస్ట్​… ఏసీపీ చెప్పిన నిజాలేంటి..?

Karthika Deepam Feb 15 Today Episode : దీపకార్తీక్​ల పెళ్లిని అంగరంగ వైభంగా నిర్వహిస్తుండగా… ఒక్కసారిగా మోనిత ఎంట్రీతో అల్లకల్లోలంగా మారింది. మోనిత వచ్చి నీకోసం పిచ్చిదానిలా ఎదురుచూస్తుంటే నువ్వు మాత్రం నీ భార్యా బిడ్డలతో టూర్​కి వెళ్లి వస్తావా అంటుంది. మీరు నన్ను ఇంత మోసం చేశాస్తారని అనుకోలేదు ఆంటీ అని సౌందర్యని అంటుంది. అనవసరంగా ఇక్కడ గొడవ సృష్టించకు మోనిత అని సౌందర్య అంటుంది.

మోనిత అని భారతి అనగానే నువ్​ మాట్లాడకు భారతి… నువ్​ కూడా నన్ను మోసం చేస్తావనుకోలేదు నీకు ముందే తెలుసుగా కార్తీక్​ వచ్చాడని అయినా నువ్​ నాకు చెప్పకుండా మీ వారిని తీసుకుని దీప కార్తీల పెళ్లిరోజు వేడుకలు వచ్చావ్​ మీరందరూ కలిసి నన్ను మోసం చేశారు అని అంటుంది. ఏ మోనిత అనవసరంగా ఇక్కడ రాద్దాంతం చెయ్యకు ఇక్కడ నుంచి వెళ్లిపో అంటుంది సౌందర్య.

Karthika Deepam Serial latest episode highlights
Karthika Deepam Serial Today Episode

నా బిడ్డను నాకు ఇస్తే నేను ఇక్కడ నుంచి వెళ్లిపోతాను అంటుంది మోనిత. దానికి ఒక్కసారిగా అందరూ షాక్​ అవుతారు. నీ బిడ్డ ఏంటి అని సౌందర్య దీప కార్తీక్​లవైపు చూస్తుంది. దానికి దీప వాడు నీ బిడ్డ కాదు కోటేశ్​ కొడుకు అంటుంది. లక్ష్మణ్ వచ్చి కాదు దీపమ్మ ఆ బిడ్డను కోటేశ్​ కిడ్నాప్​ చేశాడు అని ఆధారాలు చూపిస్తాడు దానికి మోనిత వాడు నాబిడ్డ కోటేశ్​ తీసుకెళ్లి మీ చేతిలో పెట్టి చచ్చాడు అంటుంది​. లెక్కయితే బిడ్డ ఇక్కడ అమ్మనాన్నల దగ్గరే పెరగాలి కానీ ఇక్కడ మనం కలిసి లేము కదా నా బిడ్డను నేను తీసుకుని వెళ్తాను అంటుంది. బిడ్డను తీసుకుని ముద్దాడుతుంది. దానితో ఏంటమ్మా ఆనంద్​ మా తమ్ముడే కదా అమ్మ మోనిత ఆంటీ తీసుకుని వెళ్తుంది ఏంటి అని అంటుంది హిమ. అంతలో దీప మోనిత వాడు నీ బిడ్డకాదు నీకు వాడి మీద ఎటువంటి అర్హత లేదు అని బిడ్డను లాక్కుని హిమకు ఇచ్చి పైకి వెళ్లి ఆడుకోండి అని చెప్తుంది.

వాడు నీ దగ్గరే ఉంటే మంచి ప్రవర్తనతో పెరగడు. మా దగ్గర పెరిగితే కార్తీక్​లాగా మంచి డాక్టర్​ అవుతాడు. మంచి పేరు తెచ్చుకుంటాడు అంటుంది దీప. నా బిడ్డను నాకు కాకుండా చేసి తప్పు చేస్తున్నావ్​ దీప అని మోనిత అంటుంది. ఏమైనా చేసుకో ఏ కోర్టుకు అయినా వెళ్లు బిడ్డను మాత్రం నీకిచ్చే ప్రసక్తే లేదు అని దీప తెగేసి చెప్తుంది. పోలీసులకు దగ్గరకు వెళ్లి మీ సంగతి చెప్తా అని బెదిరిస్తుంది. అంతలో ఏసీపీ మేడం వస్తుంది. ఏంటి ఏదో పోలీసులు అంటున్నారు అంటుంది ఏసీపీ.. రండి మేడం రండి వీరంతా కలిసి నా బాబుని నాకు కాకుండా చేస్తున్నారు వీరిని అరెస్ట్​ చేసి నాకు న్యాయం చెయ్యండి అంటుంది మోనిత.

దానికి ఏసీపీ ఆ లెక్క సరిచెయ్యడానికే వచ్చా ఇవ్వాల్టితో నీ ఛాప్టర్​ క్లోస్​ చేస్తా అనేసరికి ఒక్కసారిగా మోనిత షాక్​ అవుతుంది. ఏం జరిగిందా అని అందరూ ఆశ్చర్యంగా చూస్తుండగా హాస్పటల్​లో పనిచేసే ప్రశాంతి వచ్చి డాక్టర్​ బాబు మత్తులో చేసిన ఆపరేషన్​ గురించి నిజం చెప్తుంది. సౌందర్యగారు ఇచ్చిన కంప్లైంట్​ వల్లే విచారణ చేపట్టి నిజం తెలుసుకున్నాం అంటుంది ఏసీపీ… దానికి దీప సౌందర్యకు నమస్కారం చేస్తుంది.

నా కార్తీక్​ని​, నా ఆనందరావును నాకు కాకుండా చేసి పెద్ద తప్పు చేస్తున్నారు మీ అత్తా కోడళ్లు కలిసి అని అంటుంది మోనిత… హా చాలుచాలు చాల్లే పదపద అంటుంది ఏసీపీ ఈసారి దానికి మీరు తగిన ఫలితం అనుభవిస్తారు అని మోనిత దీపీ కార్తీక్​ సౌందర్యలను బెదిస్తుంది. దానితో ఈ రోజు ఎపిసోడ్​ ముగుస్తుంది ఈసారి ఎలాంటి ఎత్తులేస్తుంది.. వంటలక్క డాక్టర్​బాబుల మీద మోనిత ఎలాంటి వ్యూహప్రతివ్యూహాలు పన్నుతుంది అనేది వేచి చూడాలి.

Read Also : Karthika Deepam : కార్తీక్, దీపలకు మరోసారి పెళ్లి… సడన్ ఎంట్రీతో అందరికీ షాక్ ఇచ్చిన మోనిత ?