Karthika Deepam : బుల్లితెర ప్రేక్షకుల మన్ననలు పొందుతూ దూసుకుపోతున్న సీరియల్ కార్తీక దీపం. ఇక ఈ సీరియల్ లోని జంట డాక్టర్ బాబు, వంటలక్క గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మన తెలుగింటి ఆడపడుచుల ఫేవరెట్ మరియు మోస్ట్ వాంటెడ్ సీరియల్ గా ఈ సీరియల్ నిలుస్తుందనడంలో సందేహం లేదు. అలా సాగుతున్న ఈ సీరియల్ లో సోమవారం 14 ఫిబ్రవరి 2022 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో మీకోసం…
ఆనంద్ అచ్చం చూడటానికి నాన్నలాగే ఉన్నాడు కదా అని అంటుంది శౌర్య. దీంతో తప్పు అమ్మ అలా అనకూడదు అంటాడు. వీడు కూడా ఇప్పటి నుంచి మన ఇంటి సభ్యుడే అని అంటుంది సౌందర్య. ఇప్పటి నుంచి మేము ఆనంద్ ను తమ్ముడు అనే పిలుస్తాం అంటుంది హిమ. మనమంతా ఎక్కడికైనా వెళ్దామా అని అడుగుతుంది హిమ. దీంతో ఎక్కడికి లేదు.. ఇంట్లోనే మనం గ్రాండ్ పార్టీ చేసుకుంటున్నాం అని చెబుతుంది సౌందర్య. దీంతో ఏం పార్టీ అని అందరూ అడుగుతారు. మీ నాన్న ఫోన్ చేసి అందరినీ పిలిచి గ్రాండ్ గా పార్టీ ఇవ్వమని చెప్పాడు అని కార్తీక్ తో చెబుతుంది సౌందర్య.
మరోవైపు కార్తీక్ ఇంటికి వెళ్లి బయటి నుంచి ఓ లుక్కేసుకొని వెళ్తుంది మోనిత. కానీ.. కార్తీక్ వచ్చిన విషయం తనకు తెలియదు. బయటి నుంచి చూస్తే ఏమొస్తది అని అడుగుతుంది భారతి. ఏదో అలా నా ఆనందం అని చెబుతుంది మోనిత. వీళ్లు ఇల్లు ఏంటి లైట్లతో మెరిసిపోతోంది అని అనుకుంటుంది మోనిత. కట్ చేస్తే కార్తీక్, దీప పెళ్లి రోజు వేడుకల కోసం అందరూ రెడీ అవుతుంటారు. పిల్లలు అయితే అమ్మానాన్నలకు పెళ్లి రోజు శుభాకాంక్షలు అంటూ గ్రీటింగ్ కార్డులను డిజైన్ చేస్తుంటారు. ఇంతలో సౌందర్య వస్తుంది. ఇంతలో డాడీ పెళ్లిని ఘనంగా చేశారు కదా అని అడుగుతుంది హిమ. మాకు మీ డాడీ పెళ్లి చేసే అదృష్టం దక్కలేదు అని అంటుంది సౌందర్య. వాళ్లిద్దరూ గుడిలో పెళ్లి చేసుకొని వచ్చారు అంటుంది. అప్పటి విషయాలన్నీ గుర్తుకు తెచ్చుకుంటుంది సౌందర్య. పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చాక ఇంట్లో నుంచి దీపను బయటికి వెళ్లగొట్టిన విషయాలన్నీ గుర్తుకు తెచ్చుకుంటుంది సౌందర్య. కాకపోతే.. దీప గొప్పదనాన్ని అర్థం చేసుకున్నాను. దీప కాబట్టి పెద్దోడిని ఓపికగా భరించింది అని అనుకుంటుంది సౌందర్య.
కార్తీక్, దీప ఇద్దరినీ పెళ్లికొడుకు, పెళ్లికూతురును చేస్తారు. అయితే.. వాళ్లకు ఇవాళ తమ పెళ్లి రోజు అనే విషయం కూడా గుర్తు ఉండదు. ఇంటినంతా డెకరేట్ చేయడంతో కార్తీక్ షాక్ అవుతాడు. మమ్మీ.. ఏంటిది. ఈ హడావుడి ఏంటి అని అడుగుతాడు. దీంతో పెళ్లి రోజు శుభాకాంక్షలు పెద్దోడా అని అంటుంది సౌందర్య. దీంతో ఇవాళ మ్యారేజ్ డే కదా మరిచిపోయాను అంటాడు కార్తీక్. అది సరే కానీ.. ఇవన్నీ ఎందుకు మమ్మీ అంటాడు కార్తీక్. నీ పెళ్లిని మేము చూడలేకపోయాం కదా.. అందుకే ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నాం అంటుంది సౌందర్య.
మరోవైపు దీప కూడా పెళ్లి కూతురుగా రెడీ అవుతుంది. దీపను చూసి సౌందర్య ముచ్చటపడుతుంది. నన్ను ఈ చీర కట్టుకొని ఈ నగలు అన్నీ ఎందుకు పెట్టుకోమన్నారు అత్తయ్య అంటుంది దీప. దీంతో పెళ్లి రోజు శుభాకాంక్షలు దీప అంటుంది సౌందర్య. పెళ్లి అనేది అందరికీ కలలా ఉండిపోతుంది. కానీ.. నీకు పెళ్లికి ముందు కష్టాలే వచ్చాయి. పెళ్లి తర్వాత కష్టాలే వచ్చాయి. నీ కష్టాలన్నీ ఇంతటితో పోవాలని ఆ ఈశ్వరుడిని కోరుకుంటున్నాను అని అంటుంది సౌందర్య. దీప మమ్మల్ని ఇంకెప్పుడూ వదిలిపెట్టి వెళ్లమని ఒట్టేసి చెప్పు అంటుంది సౌందర్య. మీరంతా ఇల్లు వదిలిపెట్టి వెళ్లిపోతే మేం ఏం కావాలని అనుకున్నారు. పిల్లలు లేరు. నువ్వు లేవు. ఈ సంతోషాలు లేవు. ఎక్కడుంటున్నారో తెలియదు. ఏం తింటున్నారో తెలియదు. ఇలా అయితే ఎలా దీప. ప్రతిక్షణం నరకం అనుభవించాం తెలుసా. ఇల్లు వదిలేసి వెళ్దామని పెద్దోడు అంటే నువ్వు కూడా వాడివెంట వెళ్లిపోతే ఎలా అని అడుగుతుంది సౌందర్య.
రాముడి వెంట వెళ్లడం సీత ధర్మం కదా అత్తయ్య అంటుంది దీప. నువ్వు గొప్ప ఇల్లాలువు. నువ్వు పడ్డ కష్టం ఎవ్వరూ పడి ఉండరు. నీకు ఎంత గొప్ప మనసును ఇచ్చాడు. ఎంత ఓపికను ఇచ్చాను. ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్న నిన్ను ఆ దేవుడు నాకు కోడలుగా ఇచ్చాడు అని అంటుంది సౌందర్య. ఇంతలో పిల్లలు వచ్చి నానమ్మ అందరూ కింద ఎదురుచూస్తున్నారు పదా అంటారు. తనకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతారు. మరోవైపు తాగుబోతు మహేశ్.. అరుణ ఇంటికి వస్తాడు. ఎందుకొచ్చావు అని అడుగుతుంది అరుణ. అదేంటి అక్క.. ఇంటికి చుట్టాలు వస్తే ఎందుకు వచ్చావు అని అడుగుతారా అంటాడు మహేశ్.
నువ్వు మారవురా అని చెప్పి అక్కడి నుంచి మోనిత ఇంటికి వెళ్లబోతూ ఉంటుంది. తననే ఫాలో అవుతాడు. మోనిత ఇంటికి వెళ్లాక అక్కడ మోనితను చూస్తాడు. ఎవరు అని అడుగుతుంది మోనిత. నా తమ్ముడు అమ్మ. తాగుబోతు చచ్చినోడు అని చెబుతుంది అరుణ. నువ్వు పోరా అంటుంది అరుణ. నమస్తే మేడమ్ అంటాడు మహేశ్. దీంతో చీ పక్కకెళ్లు అంటుంది మోనిత. ఇంతలో ఇంట్లో కార్తీక్ ఫోటోను చూస్తాడు మహేష్. అక్క ఈ సారు ఫోటో ఇక్కడ ఉందేంటి అని అడుగుతాడు మహేశ్. మరోవైపు కార్తీక్, దీప పెళ్లి రోజు వేడుకలు ఘనంగా జరుగుతుంటాయి. కార్తీక్, దీపకు మళ్లీ పెళ్లి చేయిస్తుంది సౌందర్య. ఇంతలో మోనిత అక్కడికి వస్తుంది. వాళ్లను చూసి చప్పట్లు కొడుతుంది. మోనితను చూసి అందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Tufan9 Telugu News And Updates Breaking News All over World