Karthika Deepam Feb 1 Episode Today : బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇంటికి వచ్చిన హిమకు రుద్రాణి స్వీట్స్ తినిపిస్తూ ఉండగా దీప అక్కడికి వచ్చి రుద్రాణి అని గట్టిగా అరుస్తుంది. ఇక అక్కడనుంచి దీప, హిమను తీసుకు వెళుతూ ఉండగా హిమ రాను అని మొండికేస్తుంది.
Karthika Deepam Feb 1 Episode Today
ఇక దీప, హిమను బలవంతంగా తీసుకొని వెళ్తుతుంది. అలా దీప ఊర్లో ఉన్నవాళ్లను వడ్డీకి డబ్బులు అడుగుతుంది. కానీ వాళ్ళు ముక్కు మొహం తెలియని వాళ్ళకు డబ్బులు అప్పు ఇవ్వడం కుదరదని చెబుతారు. ఒక వ్యక్తి అయితే దీప ను ఏ మాత్రం పట్టించుకోకుండా ఉంటాడు. అలా దిగాలుగా వెళుతున్న దీపకు రుద్రాణి మరోసారి ఎదురవుతుంది.
మళ్ళీ రుద్రాణి ఎదురుపడి.. నువ్వు ఎంత తిరిగినా తాడికొండ గ్రామంలో అప్పు పుట్టదు అని దీపతో అంటుంది. అంతే కాకుండా నీకు తాడికొండ గ్రామంలో అప్పు పుట్టకుండా నేనే చేశాను అని చెబుతోంది. ఇక రుద్రాణి మాటలకు అసహనం వ్యక్తం చేసిన దీప అక్కడినుంచి కోపంగా వెళుతుంది. ఈలోపు సౌర్య ను కూడా మరొక హాస్పటల్ కు తీసుకు వెళతారు.
Karthika Deepam Feb 1 Episode Today : ఈరోజు ఎపిసోడ్ జరిగేది ఇదే..
ఇక ఆ హాస్పటల్ లో కూడా సౌర్య కు వైద్యం చేసే విషయంలో నిర్లక్ష్యం చేస్తారు. మరోవైపు రుద్రాణి హిమను తన ఇంటికి ఎలా తీసుకురావాలి అని ప్లాన్ చేస్తుంది. ఆ తర్వాత హాస్పిటల్ లో కార్తీక్ కు అప్పారావు తన వంతు సహాయంగా డబ్బులు ఇస్తాడు. మరోవైపు రుద్రాణి కార్తీక్, దీప లు ఏ హాస్పటల్ లో ఉన్నారో వెతుకుతూ ఉంటుంది.
తర్వాత కార్తీక్ సౌర్య మందుల కోసం మెడికల్ షాప్ కి వెళ్తాడు. అక్కడ రేటు అడగకుండా కరెక్టుగా అమౌంట్ పే చేస్తాడు. ఆ మెడికల్ షాపు ఓనర్ షాక్ అవుతాడు. దానికి కార్తీక్ ఇదివరకు నాకు మెడికల్ షాపు ఉంది అని అబద్ధం చెబుతాడు. ఆ తర్వాత ఆ హాస్పిటల్ లో డాక్టర్ ఇది చాలా టప్ కేస్ అని చెబుతాడు. ఇది కేవలం డాక్టర్ కార్తీక్ వల్లే అవుతుందని అంటాడు.
దానికి దీప నేను కార్తీక్ గారిని పిలిపించుకుంటాను. నేను వాళ్ళ ఇంట్లో ఒక నెల వంట మనిషిగా పని చేశాను అని చెబుతుంది. ఆ తర్వాత దీప కార్తీక్ ను నా సౌర్య కు వైద్యం చేయండి అంటూ బ్రతిమిలాడుతూ.. కార్తీక్ కాళ్ళు పట్టుకుంటుంది.
Read Also : Karthika Deepam: సౌర్య ప్రాణాలను ‘డాక్టర్ కార్తీక్’ మీద వదిలేసిన డాక్టర్స్!