...

Love Failure : రెండేళ్లుగా ప్రేమించుకున్నారు.. ఏం జరిగిందో తెలియదు.. ఒకేరోజు ఇంట్లో ఆత్మహత్య..!

Love Failure : ఒకరినొకరు ఇష్టపడ్డారు.. రెండేళ్లుగా ప్రేమించుకున్నారు. ఇంతలో ఏమైందో తెలియదు కానీ, వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు ఒకేరోజు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన కర్నూలు జిల్లాలోని ఆలూరులో జరిగింది. తమ ప్రేమ విషయంలో ఇంట్లో తెలియడంతో వారి తల్లిదండ్రులు ఇద్దరిని దూరం పెట్టారు. అసలు కలిసేందుకు అవకాశం లేకపోవడంతో ఇద్దరు మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ఆలూరు నగరంలోని గోవర్థన్ టాకీస్ సమీపంలో నివాసముండే విజయ్ అనే యువకుడు.. అదే కాలనీలో ఉండే ప్రియతో పరిచయం ఏర్పడింది. రెండేళ్లుగా వీరిద్దరూ ప్రేమించుకున్నారు. విజయ్ ఇంటర్ పూర్తి చేశాడు. ఐటీఐలో డీజిల్ మెకానికల్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అమ్మాయి ప్రియ కూడా అదే ప్రాంతంలో మోడల్ స్కూళ్లో ఇంటర్ పూర్తి చేసింది. పులివెందుల ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. అప్పుడే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది.

రెండేళ్లుగా ప్రేమించుకున్నారు. చివరికి వీరిద్దరి ప్రేమ విషయం పెద్దలకు తెలిసింది. అప్పటినుంచి వారిద్దరిని కలవనీయకుండా దూరం పెట్టారు. ప్రియను అక్కడి చదువు మాన్పించి మరోచోట చేర్పించారు ఆమె తల్లిదండ్రులు.. ఎప్పడో ఒకసారి వీలు చిక్కినప్పుడల్లా ఇద్దరూ ఫోన్లలో మాట్లాడుకునేవారట.. ఉన్నట్టుండి ఏం జరిగిందో తెలియదు.. విజయ్ తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విషయం తెలిసిన ప్రియ కూడా తన హాస్టల్ లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

అనంతరం ఆమెను కదిరికి తీసుకొచ్చారు. అక్కడే బంధువుల ఇంట్లో ఉన్న ప్రియ.. విజయ్ మరణాన్ని జీర్ణించుకోలేకపోయింది. అతడు లేని జీవితం తనకు ఎందుకు అనుకుందో ఏమో.. ఆమె కూడా ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విద్యార్థిని మృతదేహాన్ని గ్రామానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. మంచిగా చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకుంటారని భావించిన తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చిపోయారు.

Read Also :  Tips For Marriage : పెళ్లి విషయంలో సమస్యలా… అయితే ఈ చిట్కాలు మీకోసమే !