...

Terrifying Viral Video : వామ్మో.. రాత్రి సముద్రంలో ఓ వింత ఆకారం బోటును వెంటాడింది.. భయానక వీడియో..!

Terrifying Viral Video : ఏంటా వింతజీవి.. మెరిసే కళ్లతో బోటును వెంటాడుతోంది. వీడియోలో కనిపిస్తున్న వింత ఆకారం ఏదైనా చేపదా అంటే.. చూడటానికి అలా కనిపించడం లేదు. అందులోనూ రాత్రిపూట.. పెద్దగా కనిపించడం లేదు. కళ్లు మాత్రం మిళమిళ మెరిసిపోతున్నాయి. ఈ వింతైన జీవిని బోటు మీద వెళ్లే ఫిషర్ మ్యాన్ రికార్డు చేశాడు..

Terrifying Viral Video Mysterious sea creature with glowing eyes chases fisherman on speedboat
Terrifying Viral Video Mysterious sea creature with glowing eyes chases fisherman on speedboat

ఇప్పటికీ ఆ వింతైన ఆకారం ఏంటనేది గుర్తించలేదు.. సాధారణంగా సముద్రంలో ఎన్నో వింత నీటి జంతువులు నివసిస్తుంటాయి. కొన్ని చూడటానికి చాలా వింతగా ఉంటాయి. సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్సకారులకు ఇలాంటి అరుదైన ఘటనలు ఎదురవుతూనే ఉంటాయి. తాజాగా ఇలాంటి ఘటనే బ్రెజిల్‌లో జరిగింది. ఒక వింత జీవి భయానక వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

దక్షిణ బ్రెజిల్​లోను కోస్ట్​లో ఫిషర్ మ్యాన్ రాత్రిసమయంలో చేపల వేటకు వెళ్లాడు. అతడు ప్రయాణించే స్టీమర్‌తో పాటు ఏదో వింత జీవి కనిపించింది. సాధారణంగా బోటు లేదా ఏదైనా స్టీమర్ వెళ్తున్న సమయంలో నీటి ప్రవాహానికి చేపలు ఎదురు ఈదుతుంటాయి. ఇది కూడా అలాంటిదే కావొచ్చు.. కానీ, వింత ఆకారం చూస్తుంటే అలా కనిపించడం లేదంటున్నాడు ఆ చేపలు పట్టే వ్యక్తి. తాను స్టీమర్ వేగం పెంచితే ఆ వింత ఆకారం కూడా నీళ్లలో పైకి లేస్తూ ముందుకు దూసుకొచ్చిందని అంటున్నాడు.

అలా పైకి లేచిన సమయంలో ఆ జీవి కళ్లు దగదగమని మెరిశాయని అతడు చెప్పుకొచ్చాడు. వెంటనే అతడు తన కెమెరాలో ఆ వింత దృశ్యాన్ని రికార్డు చేశాడు.. ఆ వీడియోను ట్విట్టర్​ యూజర్‌ తన అకౌంట్‌లో షేర్ చేయడంతో వైరల్ గా మారింది.

Mysterious Sea Creature : ఏంటా వింతజీవి.. మెరిసే కళ్లతో బోటును ఎలా వెంటాడుతుందో చూడండి…


వింతైన జీవి కళ్లు మెరుస్తూ కనిపించడం.. అది వేగంగా స్టీమర్ ను వెంటాడటం వీడియోలో చూడొచ్చు. ఇంతకీ ఈ వీడియోను చూడాలంటే భయమేసేలా ఉంది. ఇంతకీ ఆ వింత జీవీ ఏంటి అనేది మిస్టరీగానే ఉంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కూడా అదేదో తిమింగలం లాంటిది అయి ఉండొచ్చునని కామెంట్లు పెడుతున్నారు.

Read Also : Maharashtra Politics : ఎన్నికల్లో పోటీకి రెండో భార్య కావాలి.. నగరమంతా బ్యానర్లు కట్టేశాడు..! ఎక్కడంటే?