Maharashtra Politics : ఎన్నికల్లో పోటీ చేయాలనేది అతడి ఆకాంక్ష. కానీ, అర్హత పొందలేకపోయాడు.. అందుకు కారణం.. తనకు రెండో భార్య లేకపోవడం.. అందుకే కాబోలు.. రెండో భార్య కోసం ఏకంగా నగరమంతా బ్యానర్లు కట్టేశాడు. ఈ వింతైన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది కొద్ది రోజుల్లో ఔరంగాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు జరుగనున్నాయి.
రమేశ్ అనే వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నాడు.. కానీ, అతడికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. దాంతో అతడికి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత కోల్పోయాడు. ఎలాగైన ఎన్నికల బరిలో నిలవాలన్నది అతడి పట్టుదల.. అందుకు ఏం చేయాలా? అని ఆలోచించాడు.. తన ఫ్యామిలీలో నుంచి ఎవరినైనా ఎన్నికల బరిలో దింపాలనుకున్నాడు.
అయితే కుటుంబ సభ్యుల్లో సోదరి, సోదరుడు, బంధువులు అయితే తనకు ఇబ్బంది అనుకున్నాడమో.. రెండో పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యాడు. వచ్చే రెండో భార్యను ఆ ఎన్నికల బరిలో నిలపాలనుకున్నాడు. అనుకున్నదే ఆలస్యం.. రెండో భార్య కావాలంటూ ప్రకటన కూడా ఇచ్చేశాడు. తనకు రాబోయే ఎలా ఉండాలో కూడా బ్యానర్లలో వివరించాడు.
ఆ బ్యానర్లను ఔరంగాబాద్ సిటీ మొత్తం కట్టించాడు.. ఒకవేళ తాను చేసుకోబోయే మహిళకు ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండాలనే కండీషన్ పెట్టాడు. ఆ బ్యానర్‌లో తన మొబైల్ నెంబర్ కూడా ఇచ్చాడు. అతడి బ్యానర్లను చూసిన నగరవాసులంతా ఏంటో వెర్రి ఆలోచన అనుకుంటున్నారంతా.. నగరమంతా బ్యానర్లు కట్టడిన అతడిపై ఔరంగాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Read Also : Technology News : ఇకపై అన్నింటికీ ఒకే కార్డ్…! కేంద్రం ప్లాన్ రెడీ..