Intinti gruhalakshmi: బుల్లితెరపై రోజుకో ట్విస్టుతో ప్రేక్షకులను టీవీల ముందు నుంచి కదలనివ్వకుండా చేస్తున్న సీరియల్ ఇంటింటి గృహలక్ష్మి. ఈ సీరియల్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. మరి ఎపిసోడ్ 562 లేటెస్ట్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
తులసి పోలీస్ స్టేషన్‌కి వెళ్లి అభికోసం వెతుకుతుంది. దానితో ఎస్సై కోపంతో నీమీద ఎఫ్‌ఐఆర్ బుక్ చేస్తా అని బెదిరిస్తాడు. లాయర్ గారు ఎస్ఐ గారే మా అబ్బాయిని ఎక్కడో దాచారు. ఇప్పుడు ఏం తెలియనట్టు నాటకం ఆడుతున్నారు.. అని చెబుతుంది. కానీ.. లాయర్ దేనికైనా సాక్ష్యం ఉండాలి. మీ సాక్ష్యం పనికిరాదు అంటాడు. దీంతో తులసికి ఏం చేయాలో అర్థం కాదు. పదండి.. వెళ్దాం అంటాడు లాయర్. దానితో నేను రాను ఇక్కడి నుంచి అంటుంది తులసి. కానీ.. లాయర్ తనను బలవంతంగా అక్కడి నుంచి తీసుకొని వెళ్తాడు. తులసి వెళ్లగానే నా ఈగోనే టచ్ చేస్తాడా.. నీ కొడుకు నీకు ఎప్పటికీ దక్కడు అని తన మనసులో అనుకుంటాడు ఎస్ఐ.
చూడండి అమ్మ. ఎస్ఐ మీ కొడుకును ఎక్కడో దాచాడు. అది నిజం. మొండితనంతో పోకుండా ఎస్ఐని కూల్ చేయండి. అప్పుడే ఎస్ఐ మీ అబ్బాయి మీకు దక్కుతాడు. నేను చెప్పాల్సింది చెప్పాను. ఆ తర్వాత మీ ఇష్టం.. అని చెప్పి లాయర్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరోవైపు ఆసుపత్రిలో ఉన్న మనోజ్ గురించి వాకబు చేయడానికి తులసి హాస్పిటల్ కు వెళ్తుంది.
మరోవైపు అభి కోసం అంకిత ఎదురుచూస్తూ ఉంటుంది. కానీ.. తులసి ఒక్కతే ఇంటికి వస్తుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. అభి ఎక్కడ. మీతో పాటు రాలేదు ఏంటి.. అని అందరూ ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతారు. అభి.. రాలేదు అంటుంది తులసి. ఎందుకు రాలేదు ఆంటి అని అడుగుతుంది అంకిత.
నా కన్నీళ్లతో అయినా మీ మనసు కరుగుతుందేమోనని ఆశగా వచ్చాను అంటుంది తులసి. చూడు.. కన్నీళ్లను కరిగిపోయే క్యారెక్టర్ కాదు నాది అంటాడు ఎస్ఐ. దీంతో నేను కూడా అంతే. ఏడు సముద్రాల అవతల దాచినా నా కొడును ఎట్టి పరిస్థితుల్లోనూ వెతికి పట్టుకుంటాను అటుంది తులసి.
దీంతో చాలెంజ్ చేస్తున్నావా అని అడుగుతాడు ఎస్ఐ. పేగు తెంచుకొని పుట్టిన బిడ్డ కోసం ఎంత దూరం అయినా వెళ్లడానికి తల్లి సిద్ధపడుతుంది. అనుమానం ఉంటే మీ తల్లిని అడగండి అంటుంది తులసి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తరువాయిభాగంలో చూడాల్సిందే.
Tufan9 Telugu News And Updates Breaking News All over World