Ramarao On Duty First Review : మాస్ మహారాజా రవితేజ (రామారావు ఆన్ డ్యూటీ సినిమా) హీరోగా వస్తున్న రామారావు ఆన్ డ్యూటీ (Ramarao On Duty) మూవీ జూలై 29న రిలీజ్ కానుంది. ఈ మూవీ పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులకు ముందుకు వస్తోంది. ఇప్పటికే థియేట్రికల్ ట్రైలర్ మూవీపై మరింత అంచనాలను పెంచేశాయి. ప్రమోషన్ సమయంలో మూవీ నిర్మాతల వివరాల ప్రకారం.. హీరో రవితేజ, దర్శకుడు శరత్ మండవ యాక్షన్ ప్రేక్షకుల్లో జోష్ నింపేలా యాక్షన్ ఎలిమెంట్స్ ఉండనున్నాయి. ఇంతకీ రామారావు ఆన్ డ్యూటీ సరిగానే చేశాడా అంటే.. ఓసారి ఫస్ట్ రివ్యూను చూద్దాం..
పేదల వివక్షకు, అవినీతికి వ్యతిరేకంగా దేశంలోని నిజాయితీపరుడైన సివిల్ సర్వెంట్ పాత్రలో రవితేజ కనిపించనున్నారు. కొన్ని గంటల వ్యవధిలో రామారావు ఆన్ డ్యూటీ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్‌లో సభ్యుడిగా ఉన్న ప్రముఖ విమర్శకుడు, ఉమైర్ సంధు రామారావు ఆన్ డ్యూటీపై తన రివ్యూను పంచుకున్నారు. రామారావు ఆన్ డ్యూటీ “ఒక సాధారణ పైసా వసూల్ మాస్ ఎంటర్‌టైనర్, రవితేజ వన్ మ్యాన్ ఆర్మీ’ అని సంధు అభిప్రాయపడ్డారు. మూవీలో రవితేజ యాక్టింగ్ అన్ని విధాలుగా అందరిని కట్టిపడేస్తుందని తెలిపాడు. మూవీలోని పాటలు, యాక్షన్ స్టంట్స్‌కు ఫస్ట్ రేటింగ్ ఇచ్చాడు.. బి, సి క్లాస్ మాస్ ప్రేక్షకులు ఈ మూవీని బాగా ఇష్టపడతారని, ఒక మంచి వన్ టైమ్ వాచ్ మాస్ మసాలా అంటూ ఉమైర్ సంధు ఫస్ట్ రివ్యూ ఇచ్చారు.
Ramarao On Duty First Review : రామారావు ఆన్ డ్యూటీ మూవీ ఫస్ట్ రివ్యూ.. రవితేజ డ్యూటీ ఎలా చేశాడంటే?
Movie Name : | Ramarao On Duty (2022) |
Director : | శరత్ మండవ |
Cast : | రవితేజ, రజిషా విజయన్, నాసర్, వేణు తొట్టెంపూడి |
Producers : | విజయ్ కుమార్ చాగంటి, సుధాకర్ చెరుకూరి |
Music : | సామ్ సిఎస్ |
Release Date : | 29 జులై 2022 |
రామారావు ఆన్ డ్యూటీ స్టోరీ, కాన్సెప్ట్ ఎంచుకోవడం మంచి ఆసక్తికరంగా ఉండనుంది. ఫస్ట్ టైం రవితేజ MRO అధికారి రోల్ చేశాడు. శరత్ మండవ రవితేజ క్యారెక్టర్ పవర్ ఫుల్‌గా డిజైన్ చేశాడు. ఈ మూవీలో బలమైన కంటెంట్ కోసం దర్శకుడు కమర్షియల్ ఎలిమెంట్స్‌ను పెద్దగా పట్టించుకోలేదనే చెప్పాలి. మూవీలో డైలాగ్స్ చాలా పవర్ ఫుల్‌గా ఉన్నాయి. రవితేజ కూడా ఈ మూవీ కోసం ప్రాణం పెట్టి మరి నటించాడు. రామారావు ఆన్ డ్యూటీ విజయం తప్పదనే సంకేతాలు వినిపిస్తున్నాయి. శరత్ కథ రాయడంలో ఒక క్లారిటీ ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ కథ రవితేజకు బాగా నచ్చడంతో బాగా ఎంజాయ్ చేశాడు.
శరత్ కథనంలో హీరో క్యారెక్టరైజేషన్ సినిమాకే హైలెట్ గా ఉంటుంది. అందులోనూ రవితేజ తన కెరీర్‌లోనే తొలిసారిగా ఎంఆర్‌ఓ అధికారిగా నటించాడు. మరోవైపు.. రామారావు ఆన్ డ్యూటీకి సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికేట్ కూడా ఇచ్చింది. ప్రివ్యూ చూసినవారంతా అల్టిమేట్ యాక్షన్ అంటున్నారు. తెలుగు ప్రేక్షకుల కోసం.. రామారావు ఆన్ డ్యూటీ మూవీని తక్కువ టికెట్ ధరలకు నిర్మాతలు అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని టిక్కెట్ ధరలను గణనీయంగా తగ్గించారు. తెలంగాణలో సింగిల్ స్క్రీన్‌లకు రూ.150, మల్టీప్లెక్స్‌ల టిక్కెట్ ధరలను రూ.195గా నిర్ణయించారు.
ఆంధ్రప్రదేశ్‌లో సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్ టిక్కెట్ల ధర వరుసగా రూ.147, రూ.177 ధరల్లో జీఎస్టీని కూడా చేర్చారు. మొత్తానికి శరత్ మండవ రామారావు ఆన్ డ్యూటీకి రచన, దర్శకత్వం వహించాడు. ఆర్టీ టీమ్ వర్క్స్‌తో కలిసి SLV మూవీస్ నిర్మించింది. ఈ మూవీలో దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ నటించారు. వేణు తొట్టెంపూడి కీ రోల్ చేశాడు. ఈ మూవీలో అన్వేషి జైన్ స్పెషల్ రోల్ చేశారు. సామ్ సిఎస్ సంగీత బాణీలను అందించారు. సినిమాటోగ్రాఫర్ సత్యం సూర్యన్, ఎడిటర్ ప్రవీణ్ కెఎల్, యాక్షన్ సీన్లను పీటర్ హెయిన్, స్టంట్ శివ రాశారు. రామారావు ఆన్ డ్యూటీ జూలై 29న థియేటర్లలో రిలీజ్ కానుంది.
Read Also : Ramarao On Duty : మాస్ రాజాను కూడా వదల్లేదుగా.. ‘రామారావు ఆన్ డ్యూటీ’ వీడియో లీక్..!