Child rockstar: చిన్న పిల్లలు అప్పుడప్పుడు భలే సరదాగా ప్రవర్తిస్తుంటారు. వారి చేష్టలతో చాలా నవ్వు తెప్పిస్తుంటాయి. ఒక్కోసారి వారు చేసే పనులు స్ఫూర్తి కలిగిస్తాయి. చాలా మందికి ఆదర్శంగా నిలుస్తాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ హల్ చల్ చేస్తోంది. ఆ పిల్లాడిని చూసి చాలా మంది ఇన్ స్ప్రైర్ అవుతున్నామని కామెంట్లు పెడుతున్నారు. ఇంతకా ఆ చిన్నారి ఏం చేశాడో ఇది చదివి తెలుసుకోండి.
పిల్లలు సైకిల్ నడుపుతుంటారు. అప్పుడప్పుడు కింద పడటం కూడా చూసే ఉంటారు. వాళ్లు అలా పడగానే దెబ్బలు తగిలితే ఏడుపు లంకించుకుంటారు. అయితే ఇక్కడ ఆ పిల్లాడు చేసిన పని చాలా మందిని ఆకట్టుకుంటోంది. ఓ పిల్లాడు సైకిల్ తొక్కుతుంటాడు. చిన్న సైకిల్ పై చాలా హుషారుగా సైకిల్ నడుపుతూ ఎంజాయ్ చేస్తుంటాడు. ఒక దగ్గరికి రాగానే సైకిల్ ను మలపబోతూ అదుపు తప్పడంతో కింద పడిపోతాడు పిల్లాడు. కింద పడ్డ ఆ పిల్లాడు ఏమాత్రం ఏడవడు. పైకి లేచి డ్యాన్స్ చేస్తాడు. బ్రేక్ డ్యాన్స్ చేస్తూ సైకిల్ పై నుండి పడటం పెద్ద విషయం కాదన్నట్లు తెగ ఎంజాయ్ చేస్తాడు. కింద పడితే దిగులు చెందకుండా జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలన్న మెసేజ్ ను చెప్పకనే చెప్పాడు ఈ బుడ్డోడు.ఆ పిల్లాడికి చెందిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చాలా మందికి ఈ వీడియో ఆదర్శంగా నిలుస్తోంది.
This should be your reaction when life challenges you! 👍😂😂pic.twitter.com/LusfAgVe96
Advertisement— Figen (@TheFigen) July 26, 2022
Advertisement