...

Karthika Deepam : సౌర్య ఆపరేషన్ కోసం త్యాగానికి సిద్ధమైన హిమ.. ఏకంగా రుద్రాణితో!

Karthika Deepam Jan 29 Episode  : బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్‌లో (Karthika Deepam Jan 29 Episode) ఏం జరిగిందో తెలుసుకుందాం. ఎలా అయినా తన రౌడీని కాపాడుకోవాలనుకున్న కార్తీక్ సైకిల్ మీద హడావిడిగా బయలు దేరుతాడు. ఈ లోపు రుద్రాణి మనుషులు ఎదురుపడి.. అక్క నిన్ను తీసుకురమ్మందంటూ బెదిరిస్తారు.

Hima ready to sacrifice for saurya operation with Rudrani
Hima ready to sacrifice for saurya operation with Rudrani

కార్తీక్ ఎంత చెప్పినా.. రుద్రాణి మనుషులు వినిపించుకోనందుకు.. వాళ్ళను కొట్టి కార్తీక్ పారిపోతాడు. ఇంట్లో అనారోగ్యంతో బాధపడుతున్న శౌర్య.. నాకు అస్సలు బాలేదని, నాన్న ఇంకా రాలేదని, నానమ్మ-తాతయ్యని చూడాలని ఉందంటూ ఏడ్చేస్తుంది. దాంతో దీప నీకేం కాదు అత్తమ్మ అంటూ ఏడుస్తుంది. నాన్నే పెద్ద డాక్టర్ అమ్మ త్వరగా నీకు నయం చేస్తాడంటూ ఏడుస్తుంది. ఏడుస్తున్న హిమని చూసిన శౌర్య.. నువ్వు ఏడుస్తున్నావా.. నీకు ఏడిస్తే జ్వరం వస్తుంది కదా అని శౌర్య అంటుంది. అమ్మా.. ఒకసారి అందర్నీ నాకు చూడాలని ఉందమ్మా.. అత్తమ్మ.. ఈ పరిస్థితుల్లో నువ్వు ఆ ఆలోచనలు ఎందుకు అని దీప అంటుంది. ఈలోపు సౌర్య మరింత ప్రాణాపాయ స్థితిలోకి వెళుతుంది.

దాంతో డాక్టర్ బాబు పరిస్థితిని చూసి.. భారతంలో కర్ణుడిలా అయిపోయింది డాక్టర్ బాబు అంటూ దీప బాధపడిపోతుంటుంది. ఇప్పుడైనా నానమ్మ-తాతయ్యకి ఫోన్ చేద్దాం అమ్మా.. వాళ్లు వచ్చి శౌర్యని ఆస్పత్రికి తీసుకెళ్తారని హిమ అంటుంది.. ఇక ఎప్పటికీ హైదరాబాద్ వెళ్లమా అని హిమ అడిగేసరికి మాట్లాడకు అంటుంది దీప.. ఇంతలో ఫోన్ చేసి… ఎక్కడికి వెళ్లారు డాక్టర్ బాబు, తొందరగా రండి.. నా గుండె ఆగిపోయేలా ఉందంటూ దీప కన్నీళ్లు పెట్టుకుంటుంది. నానమ్మ, తాతయ్యలకు, బాబాయ్ కాల్ చేయమ్మా ఆస్పత్రికి వెళ్దామని హిమ అంటుంది.

ఇంతలో అక్కడికి వచ్చినా అప్పారావ్ ఏమైంది అక్కా అంటాడు. పాపకి ఒంట్లో బాగాలేదు.. ఎవరైనా వడ్డీకి డబ్బులిచ్చేవారున్నారా అని అంటే.. బంగారం కుదవపెడితేనే డబ్బులు ఇస్తారు అక్క అని చెప్తాడు. పాపం డాక్టర్ బాబు ఎక్కడెక్కడ తిరుగుతున్నారో అని దీప తన మనసులో అనుకుంటుంది.

ఆ తర్వాత కార్తీక్ అప్పారావు దగ్గర డబ్బులు అప్పు అడగడానికి వెళతాడు. కానీ ఆ హోటల్ లో అప్పు ఉండడు. దాంతో కార్తీక్ తిరిగి వెళ్తుండగా రుద్రాణి మనుషులు మళ్ళీ ఎదురు పడతారు. ఈసారి కార్తీక్ లాగి ఒకటి చంప మీద గట్టిగా ఇచ్చి.. డైరెక్ట్ గా రుద్రాణి దగ్గరికి వెళ్లి తేల్చుకుంటాడు కార్తీక్.

మరోవైపు కార్తీక్ రుద్రాణి ఇంటి దగ్గర నుంచి తిరిగివస్తాడు. అలా వెళుతుండగా రుద్రాణి ఆపి కార్తీక్ డబ్బులను వైద్యానికి ఇస్తుంది. కానీ కార్తీక్ తీసుకోకుండా రౌడీ ని హాస్పిటల్ కి తీసుకొస్తాడు. ఇక అక్కడికి వచ్చిన రుద్రాణి డబ్బులు తీసుకోమని దానికి బదులుగా హిమను ఇవ్వమని అంటుంది. దీప వెంటనే తనకు వార్నింగ్ ఇవ్వడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

Karthika-dheepam jan 29 episode
Karthika-dheepam jan 29 episode

Karthika Deepam Jan 29 Episode : వచ్చే ఎపిసోడ్‌లో జరిగిది ఇదే..

కార్తీకదీపం సీరియల్ వచ్చే ఎపిసోడ్.. హిమ రుద్రాణి ఇంటి దగ్గరికి వెళ్లి నేను మీతోనే ఉంటాను అని డబ్బులు ఇవ్వమని కోరుతుంది. డబ్బులు లేని పరిస్థితులో త్యాగానికి సిద్ధపడింది హిమ. 

డాక్టర్ బాబు.. పాతబాకీ రద్దుచేస్తాను.. ఇప్పుడిస్తున్నది అప్పు కాదు.. దీనికి బదులుగా మీరు బంగారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఆ బంగారం ఎవరంటే అన్నట్టుగా హిమ వైపు చూపిస్తుంది రుద్రాణి. ఆ మాటలకు దీప ఆగ్రహంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తన అక్క ఆపరేషన్ అవసరమైన డబ్బుల కోసం త్యాగానికి సిద్ధమైన హిమ.. రుద్రాణి ఇంటికి వెళ్తుంది. ఇకపై నేను నీ దగ్గరే ఉంటాను అంటీ… మా అక్క ఆపరేషన్ కోసం డబ్బులు ఇవ్వండంటూ రుద్రాణీని ప్రాధమేయపడుతుంది హిమ. దాంతో రుద్రాణి మురిసిపోతూ సరే డబ్బులిస్తానని అంటుంది.

Read Also : Karthika Deepam : పాపం.. కూతురి ఆపరేషన్ చేయలేని పరిస్థితిలో డాక్టర్ బాబు!