Guppedantha Manasu Jan 29 Episode : బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఆ తర్వాత వసు రూమ్ లోకి రిషి రాగా వసు థాంక్స్ చెబుతుంది. ఎందుకని అడగగా కాఫీ తీసుకు వచ్చినందుకు అని కవర్ చేస్తుంది. మరోవైపు జగతి, మహేంద్ర లు ఎమోషనల్ గా మాట్లాడుకుంటూ ఉంటారు.
vasu-tested-rishi-and-gautam-devayani-was-so-angry
ఇక సంక్రాంతి సందర్భంగా వసు గొబ్బెమ్మ కు కావాల్సిన ఆవు పెడను తీసుకురమ్మని చెబుతుంది. ఇద్దరిలో ఎవరు వెళ్ళి తీసుకు వస్తే వారికి ఒక గిఫ్ట్ ఇస్తా అని మాట ఇస్తుంది. ఆ మాటకు గౌతమ్ ఆనందంతో ఉరకలు వేస్తాడు. కానీ రిషి మాత్రం కొంచెం గిల్టీ గా ఫీల్ అవుతాడు. కానీ చివరికి ఇద్దరూ సైకిల్ మీద ఆవుపేడ తీసుకొని రావడానికి బయలుదేరుతారు.
Guppedantha Manasu Jan 29 Episode : చీకటి గదిలో రిషి-వసుధార..
మరోవైపు దేవయాని ఫణీంద్ర ను ఇంటికి పిలిచి జగతి విషయాన్ని ఒక పెద్ద పంచాయితీల చేస్తుంది. జగతి ఇంటికి రావడాన్ని దేవయాని ఏమాత్రం జీర్ణించుకోలేకపోతుంది. ఇక ఫణీంద్ర జగతి కి బట్టలు పెట్టడానికి బట్టలు కొని తీసుకువస్తాడు. అది తెలిసిన దేవయాని ఆయనపై విరుచుకుపడుతుంది. ‘ధరణి ఏమో కమ్మగా వంటలు వండి పెడుతుంది. మీరేమో బట్టలు పెట్టండి’ అంటూ అరుస్తుంది.
రేపటి ఎపిసోడ్‌లో…
ఇక రేపటి భాగంలో ఫ్యామిలీ అంతా కలిసి భోగిమంటలతో సందడి చేస్తూ ఉంటారు. డాన్స్ చేస్తారు అంతా. జగతి, మహేంద్రలను విడగొట్టి మధ్యకు వచ్చి నిలబడుతుంది దేవయాని. ఫణీంద్ర.. ‘రిషి ఆ స్టోర్ రూమ్‌లో ఉన్న పాత వస్తువులు తెచ్చి భోగీ మంటల్లో వేసెయ్’ అంటాడు. దాంతో రిషి సరే పెదనాన్నా అని వెళ్తుంటే.. ‘సార్ నేను రావచ్చా’ అంటుంది వసు. సరేరా అని వసుని తీసుకుని స్టోర్ రూమ్‌కి వెళ్తాడు రిషి. రిషి, వసు లు పాత సామాన్లు తీసుకురావడానికి వెళ్తారు.
అక్కడ వసు ఏదో చెక్క పట్టుకోవడంతో ఆమె వేలుకు చిన్న దెబ్బ తగులుతుంది. దాంతో వసు గట్టిగా అమ్మా.. అంటుంది. ఇక రిషి ఆ వేలును నోటీలో పెట్టుకుంటాడు. దానికి వసుధరా రిషి వైపు ఎంతో ప్రేమగా చూస్తుంది. ఇంతలో అక్కడకు వచ్చిన గౌతమ్ చీకటిగా ఉంది ఇక్కడేం చేస్తున్నారని అడుగుతాడు… గౌతమ్ ఎలా ఫీల్ అవుతాడు.. రిషి, వసు ఏం చెబుతారో కమింగ్ అప్ ఎపిసోడ్‌లో.. చూడాల్సిందే..!
Read Also : Guppedantha Manasu : ఇంటికి వచ్చిన రోజే వసును బాధ పెట్టిన దేవయాని!