Roja Vs Suma: బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్య క్రమానికి గతవారం ప్రముఖ యాంకర్ సుమ హాజరై బుల్లితెర ప్రేక్షకులను సందడి చేశారు. సుమ ప్రధాన పాత్రలో నటించిన జయమ్మ పంచాయతీ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల కోసం జబర్దస్త్ కార్యక్రమానికి వచ్చారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి జడ్జ్ గా వ్యవహరించిన సుమ గురించి జబర్దస్త్ కమెడియన్స్ సుమ గురించి స్కిట్ లు చేశారు.ఇంత బిజీ షెడ్యూల్ లో సుమ ఇంట్లో తన భర్త దగ్గర ఎలా ఉంటుంది షూటింగ్ లొకేషన్ లో ఎలా ఉంటుందనే విషయాలను కళ్ళకు కట్టినట్టు చూపించారు.
ఇక తాగుబోతు రమేష్ అయితే సుమ గురించి చేసిన స్కిట్ ఎంతో అద్భుతంగా ఉందని చెప్పాలి. ఎంతోమంది స్కిట్ పై తాగుబోతు రమేష్ కు ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలోనే రోజా తాగుబోతు రమేష్ సుమ గారి గెటప్ లో ఎంతో అద్భుతంగా చేశారంటూ అతని పై ప్రశంసలు కురిపించగా వెంటనే సుమ అడ్డుపడి మీరేంటి సుమ గారు అంటున్నారు. నేను మీకన్నా 15 సంవత్సరాలు చిన్నదాన్ని అంటూనే మను కుర్చీ వెనక తన మొహం దాచి పెట్టుకుంటుంది.
ఇక ఈ విషయంపై రోజా స్పందించి మీరు ఇండస్ట్రీకి ఎప్పుడు వచ్చింది.నేను హీరోయిన్ గా ఉన్నప్పుడు మీరు కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారని రోజా చెప్పడంతో సుమా బుంగమూతి పెట్టుకుని కూర్చుంది. ఇలా కొంత గ్యాప్ ఇచ్చేసరికి సుమ ఏకంగా 15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిందంటూ సుమ గురించి రోజా మాట్లాడటంతో బుంగమూతి పెట్టుకున్న సుమని చూసి అలా ఏం కాదు మేము ఇద్దరం ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చాం ఇద్దరిదీ ఒకటే ఏజ్ అంటూ చెప్పుకొచ్చారు.ఇక సుమ యాంకర్ గా, సీరియల్ ఆర్టిస్ట్ గా నటించి ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. అలాగే పలు సినిమాలలో అక్క, వదిన పాత్రలో కూడా నటించి మెప్పించారు. మొదటిసారిగా ప్రధాన పాత్రలో నటిస్తున్న జయమ్మ పంచాయతీ త్వరలోనే విడుదల కానుంది. మరి ఈ సినిమాతో సుమ ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.