వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Puspha Movie: పుష్ప క్రేజ్ మామూలుగా లేదుగా….శ్రీవల్లి పాటకు మ్యూజిక్ బ్యాండ్ క్రియేట్ చేసిన ముంబై పోలీసులు… వీడియో వైరల్!

Puspha Movie Srivalli Song : క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన పుష్ప సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.గత ఏడాది డిసెంబర్ 17వ తేదీ విడుదలైన ఈ సినిమాకి దేశవ్యాప్తంగా ఎంతో ఆదరణ లభించింది. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలకు డైలాగులకు ఎంతోమంది వీడియోలను చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఆ వీడియోలను షేర్ చేశారు. ఇలా పుష్ప మానియా దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది.ఇక ఈ సినిమా ... Read more

By Ramesh Babu

Published on: March 17, 2022 12:15 PM

Updated on: March 17, 2022 4:15 PM

Puspha Movie Srivalli Song

---Advertisement---

Puspha Movie Srivalli Song : క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన పుష్ప సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.గత ఏడాది డిసెంబర్ 17వ తేదీ విడుదలైన ఈ సినిమాకి దేశవ్యాప్తంగా ఎంతో ఆదరణ లభించింది. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలకు డైలాగులకు ఎంతోమంది వీడియోలను చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఆ వీడియోలను షేర్ చేశారు. ఇలా పుష్ప మానియా దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది.ఇక ఈ సినిమా విడుదల అయి మూడు నెలలు దాటిపోయినా ఇంకా ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదని చెప్పాలి.

Puspha Movie Srivalli Song
Puspha Movie Srivalli Song

ముఖ్యంగా ఈ సినిమాలోని శ్రీవల్లి పాట ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ పాటకు ఎంతోమంది రీల్స్ కూడా చేశారు. నార్త్ లో ఈ పాట బాగా హిట్ అయింది. యూట్యూబ్ లో కూడా శ్రీవల్లి సాంగ్ రికార్డ్స్ క్రియేట్ చేసింది.ఇదిలా ఉండగా తాజాగా ముంబై పోలీసులు కూడా శ్రీవల్లి పాటకు బ్యాండ్ మ్యూజిక్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్ గా మారింది.


శ్రీవల్లి పాటకు మ్యూజిక్ బ్యాండ్ వాయించిన పోలీసులు ఆ వీడియోని తమ అధికారక ముంబై పోలీస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా అప్లోడ్ చేశారు. ఇక ఈ వీడియోని షేర్ చేస్తూ ముంబైవాసులు ‘శ్రీవల్లి’ పాటకు ఊగిపోవడం, ఈ పాట అందరికి నచ్చిందని తెలిసి మేము కూడా అందులో చేరిపోయి ఈ పాటను మా కాకి స్టూడియో ద్వారా అందరికీ తెలియజేయాలని భావించాము అంటూ ఈ వీడియోని అధికారిక ముంబై పోలీస్ యూట్యూబ్ చానల్ ద్వారా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది పోలీసుల శ్రీవల్లి బ్యాండ్ మ్యూజిక్ కి ఫిదా అవుతూ వీరి పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Read Also : Puspha Movie: పుష్ప క్రేజ్ మామూలుగా లేదుగా….శ్రీవల్లి పాటకు మ్యూజిక్ బ్యాండ్ క్రియేట్ చేసిన ముంబై పోలీసులు… వీడియో వైరల్!

, , , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel