Big Boss Non Stop Telugu : బిగ్ బాస్ నాన్ స్టాప్ కార్యక్రమం చూస్తుండగానే ఎనిమిది వారాలను పూర్తి చేసుకుని 9వ వారంలోకి అడుగుపెట్టింది.ఈ క్రమంలోనే 8వ వారంలో భాగంగా బిగ్ బాస్ హౌస్ నుంచి కంటెస్టెంట్ అజయ్ బయటకు వెళ్లారు. ఇక అజయ్ బయటకు వెళ్లడంతో పలువురు కంటెస్టెంట్ లు ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఇకపోతే ఎలిమినేషన్ అయిన తర్వాత మరొకసారి నామినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే 9వ వారం నామినేషన్ లో కంటెస్టెంట్ ల మధ్య తీవ్ర స్థాయిలో గొడవలు జరిగినట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా అఖిల్, యాంకర్ శివ మధ్య బిందు మాధవి బాత్రూం ఇష్యూ చెలరేగింది. ఈ క్రమంలోనే శివ అఖిల్ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఈ విధంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ నామినేట్ చేసుకున్నారు. అలాగే అరియాన, హమీదా, మిత్ర శర్మ కూడా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ రెచ్చిపోయారు. ఇక కొందరైతే సిల్లి రీజన్స్ చెబుతూ నామినేట్ చేసుకున్నారు.ఇలా బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఈ వారం ఏకంగా ఏడుగురు కంటెస్టెంట్ లు నామినేషన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ వారం నామినేషన్ లో భాగంగా శివ, అనిల్, నటరాజ్ మాస్టర్, బాబా మాస్టర్, అరియనా, మిత్రా శర్మ, హమీదా ఈ వారం నామినేషన్ లో ఉన్నారు. ఇక గత కొన్ని వారాల నుంచి బిగ్ బాస్ హౌస్ లో నటరాజ్ మాస్టర్ వ్యవహార శైలి చూసి ఎంతోమంది అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.ఈ క్రమంలోనే ఈ వారం ఈ నామినేషన్ లో ఉండగా ఈ వారం మాత్రం పక్కాగా నటరాజ్ మాస్టర్ బ్యాగ్స్ సర్ధుకోవాల్సిందేనని నెటిజన్లు వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.