#Govt Jobs#Govt jobs#Govt jobs#Govt jobs#Govt jobs#Govt jobs#Govt jobs#Govt jobs#Govt jobs#Govt jobs#Govt jobs

,

Rashmika: ఫ్రెండ్ పెళ్లిలో సందడి చేసిన రష్మీక.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫొటోస్…!

By Ramesh Babu

Published on: May 16, 2022 1:28 PM

Updated on: May 16, 2022 1:28 PM

Follow Us

---Advertisement---

Rashmika: టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో రష్మీక మందన్న కూడ ఒకరు. ఈమె గురించి తెలియని వారుండరు. చలో సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన రష్మిక ఎన్నో సినిమాలలో నటించింది. తన అందం, అభినయంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. విజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందం సినిమా సూపర్ హిట్ అవడంతో అప్పటినుండి ఈ ముద్దుగుమ్మ వెనక్కి తిరిగి చూసుకోలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ స్టార్ హీరోలందరి సరసన నటిస్తోంది.

ఇటీవల అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్రలో నటించిన ఈ అమ్మడు తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమ ద్వార పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు సంపాదించుకుంది. ఈ అమ్మడు తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషలలో సినిమాలూ చేస్తు బిజీగా ఉన్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉంటూ అన్ని విషయాలు అభిమానులతో పంచుకునే రష్మిక ఇటీవల కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. చీరకట్టులో వున్న రష్మీక ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఇటీవల ఈ ముద్దుగుమ్మ తన స్నేహితురాలి పెళ్లిలో సందడి చేసింది. తన చిన్ననాటి స్నేహితురాలు రాగిని ముద్దయ్య పెళ్లికి హాజరైన రష్మిక అక్కడ తన స్నేహితులతో కలసి దిగిన ఫొటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చెసింది. ఈ ఫోటోలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా రష్మీక ప్రస్తుతం సిద్ధార్థ్ మల్హోత్ర హీరోగా నటిస్తున్న సినిమాలో నటిస్తోంది. అంతే కాకుండా అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి ‘గుడ్ బై’ అనే మరో హిందీ సినిమా చేస్తున్నారు.ఇక తెలుగులో అల్లు అర్జున్ సరసన పుష్ప 2 సినిమాలో నటించనుంది.

, , ,

Join our WhatsApp Channel