Devatha june 4 today episode : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రాధే తన సొంత తల్లి అని తెలుసుకున్న దేవి రాధకు క్షమాపణలు చెబుతుంది.
ఈరోజు ఎపిసోడ్ లో ఆదిత్య వాళ్ళ మేనత్త ఇంట్లో అందర్నీ టార్గెట్ చేస్తూ తన మాటలతో బాధ పెడుతూ ఉంటుంది. అప్పుడు సత్యను తన పిల్లలని చూపించమని అడుగుతూ ఉండగా ఇంతలో సూరి వచ్చి ఆమెను పలుకరించడంతో సూరిని కూడా అవమానిస్తుంది.
ఏం పని చేయకుండా ఇంట్లోనే కూర్చుని తింటున్నావ్ అన్న విధంగా దారుణంగా మాట్లాడి సూరిని అవమానిస్తుంది. ఆ తర్వాత సత్య తో మాట్లాడుతూ అడిగి ఇంత సేపు అయ్యింది పిల్లలు చూపించు అని ప్రశ్నించగా సత్య ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది.
ఇంట్లో వాళ్లు కూడా ఏం చెప్పాలో తెలియక అందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఆవిడ మాత్రం అలాగే అడుగుతూ ఉండగా ఇక సత్య బాధను చూడగా వెంటనే దేవుడమ్మ అసలు నిజం చెప్పేస్తుంది. పిల్లలు లేరు అని దేవుడమ్మ చెప్పగా ఎక్కడికి వెళ్లారు అని అడుగుతుంది.
అసలు సత్యకు పిల్లలు లేరు అనడంతో ఆదిత్య వాళ్ళ మేనత్త షాక్ అవుతుంది. అప్పుడు ఆమె పదేళ్ల నుండి పిల్లలు లేకుండా ఎలా ఉన్నారు యవ్వనం కోల్పోతామని పిల్లలు వద్దు అనుకుంటున్నావా అంటూ సత్యను అవమానిస్తుంది. అంతేకాకుండా ఈ వంశం ఇక్కడితో ఆగిపోతే సరిపోదు ఎలా అయినా పిల్లలు కావాలి అని పట్టుబడుతుంది.
సత్యకు పిల్లలు పుట్టకపోయినా ఆదిత్యకు పిల్లలు పుడతారు కదా అని అనడంతో అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. వెంటనే ఆమె అంతకు మరొక పెళ్లి చేయాలి అనడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఆ మాటకు సత్య కుమిలిపోతుంది. కానీ ఆమె మాత్రం సత్యం టార్గెట్ చేస్తూ ఆదిత్యను మరొక పెళ్ళికి ఒప్పించాలి అని అంటుంది.
మరొకవైపు చిన్మయి ఇటుకలతో ఆడుకుంటుండగా తాను చూసిన దేవి తనకు అమ్మ లేదు అని తెలిస్తే బాధపడుతుంది అని అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత చిన్మయి దగ్గరికి వెళ్లి కాసేపు మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలోనే చిన్మయి మీదకు ఇటుకలు పడి దెబ్బలు తగిలి రక్తం కారుతుంది.
వెంటనే భయపడిన దేవి ఇంట్లోకి తీసుకెళ్తుంది. ఇక సత్య ఆదిత్య దగ్గరికి వెళ్లి పిల్లల కోసం అడుగుతుంది. అంతేకాకుండా రెండో పెళ్లి చేసుకోమని సలహా ఇస్తుంది. దాంతో ఆదిత్య తన పై కోపంతో రగిలిపోతాడు. ఇక రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Read Also : Devatha june 3 Today Episode : అసలు విషయాన్ని తెలుసుకున్న దేవి.. సంతోషంలో రాధ..?