Devatha june 3 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో బ్యాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఎపిసోడ్ లో. సత్య, ఆదిత్య గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది.
ఈరోజు ఎపిసోడ్ లో జానకి ఇంట్లో పని చేస్తూ ఉండగా రాధా వచ్చి నేను చేస్తాను కదా అని అనడంతో వచ్చే కోడలు ఎటువంటిదో తెలియదు కదా అందుకే ఇప్పటి నుంచే పని చేయడం నేర్చుకుంటున్నా అని ఉంటుంది జానకి. ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు పట్టింపు ఉండదు కానీ ఈ ఊరి ప్రజలు మాత్రం నిన్ను మా ఇంటికి కోడలిగా అనుకుంటున్నారు.
నీ గురించి కేవలం మేమే కాకుండా మాధవ కూడా ఆలోచిస్తున్నాడు అని అంటుంది జానకి. మరొక వైపు మాధవ ఒంటరిగా తన గదిలో కూర్చుని ఫోన్ లో రాధ ఫోటోలు చూస్తూ ఉంటాడు. అప్పుడు రాధ కోపంతో మాధవ దగ్గరికి వచ్చి మాధవ పై విరుచుకు పడుతుంది.
ఇన్ని రోజులు నువ్వే అనుకుంటే ఇప్పుడు మీ అమ్మ నాన్న అది కూడా నన్ను వేధిస్తున్నారు అని అనగా వాళ్లది తప్పు లేదు ఊరి ప్రజలు దృష్టిలో నువ్వు మా ఇంటి కోడలు అని అంటాడు మాధవ. అంతేకాకుండా నిన్ను వదిలికునేదే లేదు పిల్లల కోసం నేను పెళ్లి చేసుకుంటాను అని అనడంతో రాధ షాక్ అవుతుంది.
మీకు వేరే దారి లేదు.. అందుకే నువ్వు కనీసం ఆదిత్యకు మనకు పెళ్లి కాలేదు అన్న విషయాన్ని కూడా చెప్పలేక పోతున్నావు ఇంటికి నువ్వు బందీవి అయ్యావు అని అంటాడు మాధవ. ఇంతలో దేవి అక్కడికి వచ్చి మాధవ, రాధ మాట్లాడుతున్న మాటలు చాటుగా వింటూ ఉంటుంది.. చిన్మయి కోసం మీ ఇంటికి వచ్చాను.
నా బిడ్డ తో పాటు చిన్మయికి కూడా పాలు ఇచ్చాను.. తనని కూడా సొంత బిడ్డ లాగే చూసుకుంటున్నాను అని కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్లి పోతుంది రాదా. రాధ మాటలు విన్న దేవి ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు ఆదిత్య వాళ్ళ ఇంటికీ మేనత్త ఇంటికి వస్తుంది. వచ్చీరాగానే పనిమనుషుల గొడవ పెట్టుకొని గట్టిగా అరుస్తున్నప్పటికీ ఆదిత్య వాళ్ళు బయటికి రాకపోయేసరికి మరింత గట్టిగా అరుస్తుంది.
ఇక ఇంట్లోకి వెళ్లి దేవుడమ్మను పలకరించగా ఇంతలో అక్కడికి కమల వాళ్ళు రావడంతో ఎవరు అని అడగగా అప్పుడు దేవుడమ్మ సత్య వాళ్ళ అక్క అని అంటారు.. అంటే చెల్లి తో పాటు ఇక్కడే ఉందాము అని అనుకుంటున్నారా అంటూ కమల వాళ్లని అవమానిస్తుంది. మరొక వైపు రాధ ఒంటరిగా పనిచేస్తూ మాధవ మాట్లాడిన మాటలు తలుచుకొని కోపంతో రగిలి పోతుంది. ఇక అసలు రాధ నే అసలు తల్లి అని తెలుసుకున్న దేవి రాధకు సారీ చెబుతుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Read Also : Devatha june 2 Today Episode : రాధ గురించి బాధ పడుతున్న సత్య ఆదిత్య.. కొత్తగా ప్రవర్తిస్తున్న జానకి..?
Tufan9 Telugu News And Updates Breaking News All over World