Devatha june 6 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న దేవుత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో ఆదిత్య ను మూడో పెళ్లి చేసుకోమంటూ సత్య సలహా ఇస్తుంది.
ఈరోజు ఎపిసోడ్ లో దేవి, చిన్మయి ఇద్దరు స్కూల్ కి వెళ్తూ ఉండగా అప్పుడు దేవి, అక్క హోంవర్క్ చేసావా అని చిన్మయి ని అడగగా ఆ చేశాను అని అంటుంది చిన్మయి. హోం వర్క్ చేయకపోతే నేను సారు ఏమైనా అంటే నాకు కష్టంగా ఉంటుంది అని అంటుంది దేవి.

ఆ తర్వాత ఇద్దరు స్కూల్ కి వెళ్తూ ఉండగా అప్పుడు చిన్మయి ఫస్ట్ వెళ్లి నేను సీట్ లో కూర్చుంటాను అని అక్కడినుంచి వెళ్లగా అప్పుడు దేవి మాధవ ను ప్రశ్నిస్తూ రాధా మా అమ్మ కాదు అని ఎందుకు అబద్దం చెప్పావు నాయనా అని అనడంతో అప్పుడు మాధవ తెలివిగా నీతో అనలేదు కదా అని అంటాడు.
నువ్వు ఫోటోతో మాట్లాడేటప్పుడు విన్నాను అని దేవి అనగా అది నిన్ను కాదు చిన్మయి ని అని అంటాడు మాధవ. ఇద్దరూ నా బిడ్డలే కదా ఎవరు బాధపడినా నేను తట్టుకోలేను అని మాధవ దొంగ ప్రేమ కురిపించడంతో వెంటనే దేవి మాధవను హత్తుకుంటుంది.
ఇంతలో అక్కడికి వచ్చిన రాధ దేవి ని తీసుకొని కారు దగ్గరికి తీసుకుని వెళ్లగా అప్పుడు పిల్లలు నాయనా రాడ అని అనగా ఈ పొద్దు రాడు మీరు వెళ్ళండి అని చెప్పి పిల్లలను పంపిస్తుంది. ఇక రాదలో మార్పును గమనించిన మాధవ ఎలా అయినా తన దక్కించుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు. మరోవైపు భాష, కమల ఆదిత్య వాళ్ళ మేనత్త మాట్లాడిన మాటలు తలచుకొని బాధపడుతూ ఉంటారు.
ఆవిడ సత్యకు పిల్లలు లేరని ఆదిత్య కు మరో పెళ్లి చేస్తాను అంటుంది అని బాధపడుతుంది. ఆదిత్య మరో పెళ్లి చేసుకుంటే సత్య జీవితం ఆగం అవుతుంది అని అనుకుంటారు. ఇప్పుడు ఆదిత్యకు మరొక పెళ్లి చేస్తే రుక్మిణి త్యాగానికి ఫలితం లేకుండా పోతుంది అని బాధపడుతూ ఉంటుంది కమల.
మరొకవైపు ఆదిత్య రాధను కలిసి జరిగిన విషయాన్ని వివరించడంతో రాధ ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇదే విషయంపై నేను సత్య పై కోప్పడ్డాను అని రాధతో చెబుతాడు మాధవ. అప్పుడు రాధ తన మనసులో చెల్లి జీవితం ఆగం కావద్దు అని ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్లి పోతుంది.
స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వచ్చిన పిల్లలు ఆనందంతో స్కూల్ తరఫున మమ్మల్ని బయటికి తీసుకెళ్తున్నారు అని అనగా అప్పుడు రాద ఎక్కడికి వెళ్ళలేదు అని గట్టిగా చెప్పడంతో పిల్లలు నిరాశ పడతారు. జానకి కూడా రాధ మాటలకు వత్తాసు పలుకుడంతో పిల్లలు మరింత బాధ పడతారు.
Read Also : Devatha june 4 today episode : ఆదిత్యకు రెండో పెళ్లి ఆలోచనలో ఆదిత్య మేనత్త.. సత్యపై కోప్పడిన ఆదిత్య..?