...

Natural Star Nani : 12 కోట్లతో ఆ మూవీ కోసం భారీ సెట్ వేయించిన నేచురల్ స్టార్ నాని…

Natural Star Nani : నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. వరుసగా సినిమాలను పట్టాలెక్కిస్తూ దూసుకుపోతున్నాడు ఈ హీరో. చాలా రోజుల తరువాత ఓ మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు నాని. రీసెంట్ గా శ్యామ్ సింగరాయ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నాని. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో నాని రెండు విభిన్నమైన పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు. సాయి పల్లవి , కృతి శెట్టి ఈ సినిమాలో నానికి జోడీగా నటించి ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే పొందారు.

కాగా నాని ప్రస్తుతం నటిస్తున్న రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. వాటిలో ఒకటి… ” అంటే సుందరానికీ ” మూవీ. ఈ సినిమా షూటింగ్ షూటింగ్ కూడా దాదాపుగా పూర్తి అయినట్లు తెలుస్తుంది. అలానే శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో దసరా సినిమా చేస్తున్నాడు నాని. ఈ మూవీ ఇప్పుడు షూటింగ్ దశలో ఉంది. ఈ మూవీలో నాని మరోసారి నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో కనిపించునున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు. ఇందులో నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్‏గా నటిస్తోంది.

సినిమా కోసం మొదటిసారి తెలంగాణ యాసలో మాట్లాడనున్నాడు. దసరా’ చిత్రాన్ని సింగరేణి బొగ్గు గనుల బ్యాక్ డ్రాప్ లో కంప్లీట్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. నాని ఇందులో ఒక గజదొంగగా కనిపించనున్నాడట. ఈ సినిమా కోసం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేకంగా కొన్ని సెట్స్ ని నిర్మించనున్నారట. పది ఎకరాల్లో ఓ భారీ విలేజ్ సెట్ ను వేస్తున్నారట… ఈ ఒక్క సెట్ కోసమే దాదాపు పన్నెండు కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు టాక్. గతంలో నాని నటించిన వి.. జెంటిల్మెన్ సినిమాలలో నెగిటివ్ షెడ్స్ పాత్రలలో నటించి మెప్పించాడు. ఇప్పుడు మరోసారి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు.

Read Also : Health Tips : గుడ్డును అలా తినడం కన్నా ఇలా చేస్తేనే బెటర్ అని తెలుసా …