Roja Comments Nani : ఆంధప్రదేశ్‌లో సినిమా థియేటర్స్ టికెట్స్ ప్రైసెస్ వ్యవహారం ఇంకా ముదురుతోంది. టికెట్ల ధరలను ప్రభుత్వం నిర్ణయించడం పట్ల పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నేచురల్ స్టార్ నాని ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వంపై పలు వ్యాఖ్యలు చేయగా, ఆ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్నారు ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు. తాజాగా నాని వ్యాఖ్యలకు ప్రముఖ సినీ నటి, నగరి ఎమ్మెల్యే, వైసీపీ ఫైర్ బ్రాండ్ లీడర్ రోజా స్పందించారు.
టాకీసుల్లో టికెట్స్ ధరలు తగ్గించడం అంటే సినీ ప్రేక్షకులను అవమానించడమేనని, మూవీ థియేటర్స్ కలెక్షన్ కంటే కిరాణా వ్యాపారం కలెక్షన్స్ ఎక్కువగా ఉంటున్నాయని నాని అన్నారు. కాగా, నాని వ్యాఖ్యలను ఏపీ మంత్రులు, వేసీపీ నేతలు తప్పుబడుతున్నారు. నాని మాటల వలన తెలుగు సినీ పరిశ్రమకు తీవ్ర నష్టం జరుగుతుందని ఎమ్మెల్యే రోజా అన్నారు. థియేటర్స్ కంటే కిరాణా వ్యాపారంలో లాభాలు వస్తాయని నాని పేర్కొన్న నేపథ్యంలో నాని ఆ బిజినెస్ చేస్తే బెటర్ అని రోజా చెప్పారు.
ఇండస్ట్రీ మేలు కోసం జగన్ సర్కారు కృషి చేస్తుందని, సినిమా టికెట్ల ధర విషయంలో కమిటీ పరిశీలన చేస్తుందని రోజా అంది. అయితే, హీరో నాని వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయని, ఆయన వ్యాఖ్యలు సరికాదని, నానికి సినిమాల కంటే కిరాణా వ్యాపారమే బెస్టని చురకలంటించింది రోజా. కొంత మంది రాజకీయ నేతల వలన ఇటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయని, సినీ పరిశ్రమకు జగన్ సర్కారు అండగా ఉంటుందని రోజా తెలిపింది.
మొత్తంగా ఏపీలో థియేటర్స్ టికెట్స్ ధరల విషయమై వివాదం ఇంకా రాజుకుంటున్నది. ప్రభుత్వం టికెట్ల ధరను నిర్ణయించడాన్ని తాజాగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా తప్పుబట్టారు. ఆయన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి మరి..
Read Also : Samantha : ఆ హీరోను ఇక ఎప్పుడూ నమ్ముతా.. సమంత సెన్సేషనల్ పోస్ట్..
Tufan9 Telugu News providing All Categories of Content from all over world