Natural star nani: పక్కింటి అబ్బాయిలా కనిపించే లుక్, మెస్మరైజింగ్ యాక్టింగ్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు నాని. చాలా నాచురల్ గా యాక్టింగ్ చేస్తూ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తారు. అందుకే నాచురల్ స్టార్ అనే పేరు వచ్చింది. ఇటీవలే అంటే సుందరానికి అనే సినిమాతో వచ్చి పలకరించాడు. అయితే ఈ సినిమా అంతగా ప్రేక్షకులకు నచ్చలేదు. అందుకే అలా వచ్చి ఇలా వెళ్లిపోయింది. థియేటర్లలో రిలీజైన ప్రేక్షకులు లేక వెలవెలపోయాయి. అంటే సుందరానికి సినిమా తర్వాత ఎలాంటి గ్యాప్ తీసుకోకుండా మరో సినిమాను పట్టాలెక్కించాడు నాచురల్ స్టార్.
శ్రీకాంత్ ఓదెలా డైరెక్షన్ లో దసరా సినిమా చేస్తున్నాడు నాని. ఈ సినిమా చిత్రీ కరణంలో స్వల్ప అపశృతి చోటు చేసుకున్నట్లు సమాచారం. దసరా సినిమా చిత్రీకరణ గోదావర ఖనిలో జరుగుతోంది. సినిమా షూటింగ్ లో భాగంగా ఒక సీన్ తీసే సమయంలో ప్రమాదం జరిగిందని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి. బొగ్గు ట్రక్కు కింద నాని ఉండగా అతడిపై కొంత బొగ్గు పడినట్లు సమాచారం. అయితే దీని వల్ల నానికి ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. కొద్ది సేపు చిత్రీకరణకు అంతరాయం ఏర్పడినా.. నాని వెంటనే షూటింగ్ ప్రారంభిద్దాం అని అనడటంతో షూటింగ్ యథావిథిగా జరుగుతోందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.