Goddess Laxmidevi : ఇంట్లో ఆడాళ్లు ఇలా ఉంటే.. లక్ష్మీదేవి మిమ్మల్ని వదిలి వెళ్లదు!

Goddess Laxmidevi
Goddess Laxmidevi

Goddess Laxmidevi : ఇంటిని చూసి ఇల్లాలిని చూడాలంటారు మన పెద్దలు. అవును ఇది నిజమే. ఎందుకంటే ఏ ఇళ్లు అయితే పరిశుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లోనే లక్ష్మీ దేవి కొలువై ఉంటుందని నమ్మకం. అందుకే ప్రతిరోజూ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలని చెప్తుంటారు. అందులో భాగంగానే.. కొన్ని పనులు చేయాలని, ఇంట్లోని స్త్రీలు ఇలా ఉండాలని చెప్పారు. అయితే అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

సూర్యోదయం అవ్వకముందే లేచి ఇంటిని శుభ్రం చేస్కోవాలి. బారెడు పొద్దెక్కిన తర్వాత లేచి ఇంటిని శుభ్రం చేస్తే.. దరిద్ర లక్ష్మీ వస్తుందట. అలాగే లేచి ఇంటిని శుభ్రం చేయగానే స్నానం చేయాలి. ఆలస్యంగా అస్సలే స్నానం చేయకూడదు. ఆ తర్వాత దైవ ప్రార్థన చేయాలి. నేవేద్యం సమర్పించాలి. ఆ తర్వాతే మీరు ఏదైనా తినాలి. స్నానం చేసే వరకు వంట గదిలోకి వెళ్లకూడదు.

అలాగే సంధ్యా సమయంలో అస్సలే తల దువ్వకూడదు. ఇలా చేస్తే లక్ష్మీ దేవికి కోపం వస్తుందట. మీ నగదు పెట్టే లాకర్ ను ఇంటికి ఉత్తరం వైపు తెరిచి ఉంచాలి. కుబేర చిత్రాన్ని నగదు పెట్టెలో ఉంచితే ఇంట్లో శ్రేయస్సుకు దారి తీస్తుందని చాలా మంది నమ్ముతారు. అలాగే కొన్ని ఇండోర్ ప్లాంట్లను, మనీ ప్లాంట్లను ఇంటి నైరుతి మూలలో ఉంచాలి. ఇలా ఉంచితే పేదరికం తగ్గుతుందట.

Advertisement

Read Also :Feng shui tips : ఫెంగ్ షుయ్ ను ఇంట్లో పెట్టుకోవడం వల్ల అంతా ఆనందమేనట.. తెలుసా?

Advertisement