...

Health tips: అర్ధరాత్రిళ్లు అతిగా దాహం వేస్తోందా.. అయితే జాగ్రత్తగా ఉండాల్సిందేనట!

Health tips: అర్ధరాత్రి గొంతు ఎండిపోవడం, విపరీతంగా దాహం వేయడం వల్ల చాలా మందికి నిద్రాబంగం కల్గుతుంది. ఈ సమస్య కొందరికి వేసవిలో ఎక్కువగా జరుగుతుంటుంది. అలాగే మరి కొందరికి ప్రతీ సీజన్ లో జరుగుతుంది. వేసవిలో శరీరం పూర్తిగా చెమటతో తడిసిపోయాయి. గొంతు ఎండిపోయి తీవ్రంగా దాహం వేస్తుంటుంది. అయితే ఇది కేవలం పెరిగిన ఉష్ణోగ్రతల వల్ల మాత్రమే కాదు.. మరిన్ని ఇతర అనారోగ్య సమస్యల కారణంగానూ ఇలా అర్ధ రాత్రిళ్లు దాహం వేస్తుంటుంది. ఇలా రాత్రిళ్లు నిద్రలో దాహం వేయడానికి గల కారణాలు… అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందామా.

రాత్రిళ్లు దాహం వేయడం.. నిద్రలో నుంచి మేల్కోవడం నీళ్లు తాగిన త్వాత ఇక నిద్ర పట్టదు. ఈ సమస్య ఎందుకు వస్తుందంటే.. మీరు రోజు శరీరానికి సరిపడేంత నీరు తాగలేదని అర్థం. దీంతో రాత్రిళ్లు పలుమార్లు దాహం వేసి నిద్రకు ఆటంకం కల్గుతుంది. రోజుకు 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగడం చాలా మంచిది. పగలు కాఫీ, టీ, సోడా, చక్కెరతో చేసిన నీటి పరిమాణాన్ని తగ్గించడానికి పని చేస్తాయి. వీటి వల్ల శరీరం తేమెను కోల్పోతుంది.

రోజులో ఒఖటి లేదా రెండు కప్పుల కంటే ఎక్కువగా కాఫీ, టీ తాగొద్దు. సోడా, శీతల పానీయాలు, షర్బత్ మితంగా తీసుకోవాలి. లస్సీ, మజ్జిగా, నిమ్మరసం, కొబ్బరి నీరు తీసుకోవడం మంచిది. వేసవిలో మసాలాలు, నూనెలో వేయించిన ఆహారాన్ని తీసుకోవద్దు. ఉప్పు ఎక్కువగా ఉండే స్నాక్స్ తీసుకోవడం మానేయాలి. ఇవి శరీరంలో నీటి కొరతను కల్గించడమే కాకుండా అధిక రక్తపోటు వ్యాధిని కల్గిస్తాయి.