...

Mango Health Benefits: మామిడి పండ్ల సీజన్ కదా అని ఎక్కువగా తింటున్నారా… ఇవి తెలుసుకోవాల్సిందే!

Mango Health Benefits: వేసవికాలం వచ్చిందంటే చాలు ఎన్నో రకాల మామిడి పండ్లు మార్కెట్లోకి వస్తాయి. ఈ క్రమంలోనే మామిడిపండ్ల ప్రియులు ఎక్కువగా మామిడి పండ్లను కొనుగోలు చేసి ఎంతో సంతృప్తిగా తింటూ ఉంటారు. ఇలా మామిడి పండ్లు కేవలం ఏడాదికొకసారి మాత్రమే వస్తాయి కనుక చాలా మంది ఎక్కువగా మామిడి పండ్లు తినడానికి ఇష్టపడతారు. ఈ విధంగా మామిడి పండ్లు అధికంగా తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇక్కడ తెలుసుకుందాం…

*మామిడి పండులో విటమిన్ ఏ తో పాటు సీకెరోటినాయిడ్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇవన్నీ కూడా మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచడంలో దోహదం చేస్తాయి.

*మామిడి పండులో ఉండే పొటాషియం, మెగ్నీషియం రక్తపోటు సమస్యను అదుపులో ఉంచడానికి కీలకపాత్ర పోషిస్తాయి.

*రక్తహీనత సమస్యతో బాధపడే వారు మామిడి పండ్లు అధికంగా తినడం వల్ల శరీరానికి కావలసిన ఐరన్ పుష్కలంగా అందుతుంది.మామిడి పండులో ఐరన్ క్యాల్షియం అధికంగా ఉండటం వల్ల రక్తహీనత సమస్య నుంచి బయటపడటమే కాకుండా ఎముకల దృఢత్వానికి కూడా దోహదం చేస్తుంది.

*మామిడి పండులో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగు పరిచి మలబద్దకం సమస్యను కూడా నివారిస్తుంది. అలాగే ఫైబర్ కంటేట్ అధికంగా ఉండటం చేత కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో శరీర బరువు తగ్గించుకోవడానికి కూడా మామిడిపండ్లు దోహదం చేస్తాయి.

*కేవలం మామిడికాయ మాత్రమే కాకుండా మామిడి ఆకులు కూడా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మధుమేహ సమస్యతో బాధపడేవారు 5 లేదా 6 మామిడి ఆకులనురాత్రంతా నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం పరగడుపున తాగడం వల్ల చక్కెర వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చు.

*యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం. క్వార్సెటిన్‌(కాన్సర్‌ కణాలను నశింపజేస్తుంది), ఫిసెటిన్‌, ఐసోక్వెర్సిటిన్‌, ఆస్ట్రాగాలిన్‌, గాలిక్‌ యాసిడ్‌, మిథైల్‌ గాలేట్‌ ఇవన్నీ క్యాన్సర్ నిరోధకాలుగా పనిచేస్తూ మన శరీరంలో వివిధ రకాల క్యాన్సర్ కణాలను నశింపజేసే క్యాన్సర్ నుంచి మనకు విముక్తిని కలిగిస్తాయి.