...

Health Tips: ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు పాలలో ఈ పొడి కలుపుకుని తాగితే చాలు… ఆ సమస్యలన్నీ మాయం!

Health Tips: ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లకు అనుగుణంగా చాలా మంది వారి ఆహార విషయంలో ఎన్నో మార్పులు చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఆహారంలో సరైన పోషక విలువలు లేకపోవటం వల్ల అతి చిన్న వయసులోనే వివిధ రకాల సమస్యలతో బాధపడుతున్నారు. మరీ ముఖ్యంగా కీళ్లనొప్పుల సమస్యతో బాధపడే వారి సంఖ్య రోజు రోజుకు అధికమవుతోంది.30 సంవత్సరాల వయస్సు ఉన్న వ్యక్తులు కూడా ప్రస్తుత కాలంలో కీళ్లనొప్పుల సమస్యతో బాధపడుతున్నారు.ఈ విధంగా పలు రకాల అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఈ చిన్న చిట్కాలు పాటిస్తే చాలు వారికున్న అనారోగ్య సమస్యలను కూడా దూరమవుతాయి. మరి ఆ చిట్కా ఏంటి అనే విషయానికి వస్తే…

రెండు టేబుల్ స్పూన్ల తెల్లనువ్వులు, ఐదు బాదం పప్పులు, రెండు టేబుల్ స్పూన్ల గసగసాల మిక్సీలో మెత్తని మిశ్రమంలా తయారు చేసుకోవాలి. అయితే ఈ మిశ్రమాన్ని మరికాస్త ఎక్కువగా తయారు చేసుకొని భద్రంగా నిల్వచేసుకొని పెట్టుకోవచ్చు.ఇకపోతే ప్రతిరోజు రాత్రి పడుకోవడానికి అరగంట ముందు ఒక గ్లాసు పాలను బాగా మరిగించి ఒక టేబుల్ స్పూన్ మిశ్రమం వేసి మూడు సార్లు పొంగు వచ్చేవరకు మరిగించాలి. అనంతరం తక్కువ మంట పై పాలలో చిన్న బెల్లం ముక్క వేసి ఈ పాలను మరిగించి ప్రతి రోజూ పడుకోవడానికి అరగంట ముందు తాగటం వల్ల మన శరీరానికి కావల్సినంత క్యాల్షియం ఫైబర్ లభించి కీళ్ల నొప్పులు సమస్య నుంచి బయట పడవచ్చు.

డయాబెటిస్ తో బాధపడేవారు బెల్లం లేకుండా ప్రతిరోజు ఈ పొడి కలుపుకుని తాగితే వారిలో కూడా ఏ విధమైనటువంటి కీళ్లనొప్పుల సమస్యలు ఉండవు. నువ్వులలో ఉండే ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి దోహదపడుతుంది. బాదంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ మన శరీరంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచడానికి దోహదం చేస్తుంది ఇక గసగసాల ఏ విధమైనటువంటి జీర్ణక్రియ సంబంధిత సమస్యలు లేకుండా కాపాడుతుంది.అందుకే ప్రతిరోజు రాత్రి పడుకోవడానికి అరగంట ముందు పాలలో ఈ మిశ్రమం కలుపుకొని తాగడం వల్ల 60 సంవత్సరాల వయసులో కూడా ఏ విధమైనటువంటి కీళ్లనొప్పులు లేకుండా ఎంతో హుషారుగా ఉంటారు.