...
Telugu NewsHealth NewsBeauty Tips: మెరిసే చర్మం మీ సొంతం కావాలంటే ఈ వంటింటి చిట్కాలు పాటించాల్సిందే!

Beauty Tips: మెరిసే చర్మం మీ సొంతం కావాలంటే ఈ వంటింటి చిట్కాలు పాటించాల్సిందే!

Beauty Tips:ప్రస్తుత కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుండి ముసలివారికి వరకు అందరూ అందంగా కనిపించటానికి ఆసక్తి చూపుతారు. ఈ రోజుల్లో చాలామంది వేల రూపాయలు ఖర్చు చేసి బ్యూటీపార్లర్ కి వెళ్లి ఫేషియల్స్ చేయించుకోవటం, బయట మార్కెట్లో లభించే బ్యూటీ ప్రొడక్ట్స్ కొని అందానికి మెరుగులు దిద్దుకుంటూ ఉన్నారు. కానీ వాటి వల్ల పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. కానీ మన వంటింట్లో ఉండే కొన్ని పదార్థాలు ఉపయోగించి చిట్కాల ద్వారా అందమైన మెరిసే చర్మం సొంతం చేసుకోవచ్చు. ఆ వంటింటి చిట్కాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

అందరి ఇళ్ళలో పాలు ఖచ్చితంగా ఉంటాయి.ఒక కప్పులో కొంచెం సెనగపిండి తీసుకుని అందులో కొన్ని పచ్చి పాలు, పసుపు కలిపి పేస్టులా తయారు చేసుకొని ముఖానికి రాసుకోవాలి . పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో మోహాన్ని కడుక్కోవటం వల్ల చర్మం మీద పేరుకుపోయిన మృత కణాలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా తయారవుతుంది. అంతేకాకుండా పసుపులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ముఖం మీద ఉన్న నల్ల మచ్చలు, మొటిమలు తొలగించడంలో ఎంతో ఉపయోగపడుతుంది.

Advertisement

బాదం పొడిలో కొంచెం పచ్చి పాలు, ఓట్‌మీల్‌ కలిపి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ముఖానికి ఈ పేస్ట్ ను అప్లై చేసి పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల చర్మం రంగు కాంతివంతంగా తయారవుతుంది. బాగా పండిన బొప్పాయి పండు మెత్తగా పేస్ట్ చేసి ముఖానికి రాసుకోవాలి ఒక 15 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. వారానికి రెండు మూడు సార్లు ఇలా చేయడం వల్ల కాలుష్యం వల్ల ఏర్పడిన ట్యాన్ తొలగిపోయి మొహం కాంతివంతంగా తయారవుతుంది.

Advertisement

ఒక కప్పు లో కొంచెం నిమ్మరసం తీసుకుని అందులో కొంచెం రోజ్ వాటర్,చక్కెర కలిపి ముఖం మీద అప్లై చేసి నెమ్మదిగా మర్దన చేయాలి. ఇలా ఒక 10 నిమిషాల పాటు చేసి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది స్ర్కబ్ లాగ పని చేసి ముఖం మీద ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించి మొహం మెరిసేలా చేస్తుంది.

Advertisement
Advertisement
admin
adminhttps://tufan9.com/
Tufan9 Telugu News And Updates Breaking News All over World
RELATED ARTICLES

తాజా వార్తలు