Diabetic Foot: షుగర్ ఎక్కువైతే పాదాల్లో వచ్చే సమస్యలివే..!

Diabetic Foot: ప్రస్తుత కాలంలో చాలా మంది డయాబెటిక్ సమస్యతో బాధపడుతున్నారు. చిన్న పిల్లల నుంచి పండు ముసలి వాళ్ల వరకు ఈ సమస్యతో సతమతం అవుతున్నారు. అయితే మధుమేహంపై సరైన అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది అనేక రకాల సమస్యలు ఎదుర్కుంటారు. ముఖ్యంగా డయాబెటిస్ బాధితులు తమ పాదాల సంరక్షణ గురిచి తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదు. షుగర్ సమస్య ఉన్న వారు తీస్కోవాల్సిన పాదాల సరక్షణ కూడా ముఖ్యమైంది.

రక్తంలో చక్కెర లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు కిడ్నీలు, లివర్ పై ఎక్కువగా ప్రభావం చూపుతోంది. కానీ అది మన పాదాలకు కూడా వివిధ రకాల సమస్యలు ఉత్పన్నం అవుతాయి. రక్తంలో ఉండే అధిక షుగర్ లెవెల్స్ నరాల సమస్యలు వచ్చే ఆస్కారం ఉంటుంది. అలాగే రక్త ప్రసరణలో ఇబ్బందులు, పాదాలపై పుండ్లు ఏర్పడడం మొద్దుబారడ లాంటివి జరుగుతాయి.

స్పర్శ లేకపోవడం వల్ల పాదాలకు చిన్న గాయం అయినప్పటికీ.. అది చాలా తీవ్రంగా మారే అవకాశం ఉంటుంది. దీనినే వైద్య భాషలో డయాబెటిక్ న్యూరోపతి అని పిలుస్తారు. రక్త నాళాల్లో కొన్ని చోట్ల రక్తం గడ్డ కట్టడం వల్ల నరాలు ఉబ్బినట్లుగా తయారవడం వంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఈ సమస్య తీవ్రమైనప్పుడు పాదాలను తొలగించాల్సిన పరిస్థితి కూడా తలెత్తవచ్చు.