Salt problems: ప్రస్తుత కాలంలో చాలా మంది అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నారు. బీపీ, షుగర్ లాగానే థైరాయిడ్ సమస్య కూడా చాలా మందిని బాధిస్తోంది. ఎక్కువగా యువత ఈ థైరాయిడ్ సమస్యతో బాధ పడుతున్నారు. ఈ సమస్య బారిన పడ్డ వారు దీర్ఘ కాలం పాటు మందులను వాడాల్సి వస్తోంది. అయితే అయోడిన్ లోపం కారణంగానే థైరాయిడ్ వస్తుందని మనందరికీ తెలుసు. అయోడిన్ కలిపిన ఉప్పను ఉపయోగించడం వల్ల ఈ సమస్య బారిన పడకుండా ఉంటారని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే అయోడిన్ కలిసిన ఉప్పును ఉపయోగించినప్పటికీ.. చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు.
థైరాయిడ్ లో హైరర్ థైరాయిడ్, హైపో థైరాయిడ్ అనే రెండు రకాలు ఉంటాయి. అయోడిన్ ను తక్కువగా తీసుకోవడం వల్ల హైపర్ థైరాయిడ్ బారిన పడతామని, అయోడిన్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల హైపో థైరాయిడ్ బారిన పడతామని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఎక్కువ మంది హైపో థైరాయిడ్ వల్ల బాధపడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. సాధారణ ఉప్పను వాడినప్పుడే పరిస్థితి బాగుండేదని.. అయోడిన్ ఉన్న వాడినప్పటి నుంచే ఈ సమస్య పెరుగుతోందని వైద్యులు వివరిస్తున్నారు. అందుకే అయోడిన్ కలిపిన ఉప్పును మానేసి సరైన ఆహారం తీస్కొని థైరాయిడ్ నుంచి బయటపడమని సూచిస్తున్నారు.