Hyderabad: కిడ్నీలో రాళ్లు ఉన్నాయని పలువురు చెబితే సాధారణమే కదా చాలా మందిలో ఇలా ఉంటాయని అనుకుంటాం. కానీ కిడ్నీలో 206 రాళ్లు ఉంటే ఏమంటాం. ఏమీ అనలేం. ఆశ్చర్యపోవడం తప్పా. నల్గొండ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కిడ్నీలో 206 రాళ్లు గుర్తించారు వైద్యులు. రోగిని నొప్పి తీవ్రం కావడంతో వాటిని తొలగించక తప్పని పరిస్థితి తలెత్తింది. అతడిని హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు.
కిడ్నీలో రాళ్లతో తీవ్రమైన నొప్పి రాగా ఏప్రిల్ 22న అవేర్ గ్లెనీగల్స్ గ్లోబల్ ఆస్పత్రిలో రోగిని చేర్పించారు బంధువులు. అతని వైద్యులు పరిశీలించారు. ప్రాథమిక పరీక్షలు, అల్ట్రాసౌండ్ స్కాన్ చేశారు. ఈ పరీక్షల్లో అతని ఎడమ మూత్ర పిండంలో చాలా రాళ్లు ఉన్నట్లు గుర్తించారు డాక్టర్లు. తర్వాత సిటీ స్కాన్ బ్ స్కాన్ చేసి దీని మరోసారి ధ్రువీకరించుకున్నారు. తర్వాత గంట పాటు కీహోల్ శస్త్రచికిత్స చేశామని వైద్యులు వెల్లడించారు.
ఈ సమయంలో మొత్తం 206 రాళ్లను మూత్రపిండం నుంచి తొలగించినట్లు వెల్లడించారు. కీహోల్ శస్త్రచికిత్స అనంతరం రోగి కోలుకున్నాడని… రెండో రోజే అతడిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ చేశారు. వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉండటంతో చాలా మంది డీ హైడ్రేషన్ కు గురవుతున్నారని వైద్యులు తెలిపారు. దీంతో మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడతాయని అందుకే వీలైనంత ఎక్కువ నీళ్లు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎండలో ప్రయాణాలు చేయొద్దని… వీలైనంతగా నీడ పట్టున ఉండాలని చెబుతున్నారు. శీతల పానీయాలు అస్సలే తాగవద్దని సూచిస్తున్నారు.
Read Also : Health remedy: ఈ ఒక్క ఆకు అనే రకాల నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుంది