Corona Vaccine: గత మూడు సంవత్సరాల నుంచి వివిధ వేరియంట్లో రూపంలో కరోనా మహమ్మారి యావత్ ప్రపంచ దేశాలన్నింటిలో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.ఈ క్రమంలోనే ఈ మహమ్మారిని కట్టడి చేయడం కోసం ఇప్పటికే పలు రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇలా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటూ ఈ మహమ్మారితో పోరాడుతున్నారు. వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల మన శరీరంలో అధిక రోగనిరోధక శక్తి వృద్ధి చెంది ఈ వైరస్ ని ఎదుర్కొనే శక్తి ఉంటుంది.
అయితే ఇప్పటికీ చాలామంది వ్యాక్సిన్ వేయించుకోవటం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయనే భ్రమలో కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఇష్టపడటం లేదు. అయితే కరోనా వ్యాక్సిన్ వల్ల ఏ విధమైనటువంటి సైడ్ఎఫెక్ట్స్ ఉండవు కేవలం అలసట, జ్వరం కొందరిలో తలనొప్పి వంటి స్వల్ప లక్షణాలు మాత్రమే కనబడతాయి. కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత ఏ విధమైనటువంటి సైడ్ఎఫెక్ట్స్ లేకుండా ఉండాలంటే మన ఆహార విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.మరి వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయానికి వస్తే…
ముఖ్యంగా వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత మనం తీసుకునే ఆహార పదార్థాలలో ఫైబర్ అధికంగా ఉండేలా చూసుకోవాలి.ఫైబర్ అధికంగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల మనల్ని ఎంతో ప్రశాంతంగా ఉంచడమే కాకుండా మన శరీరానికి కావలసిన రోగ నిరోధక శక్తిని కూడా పెంపొందిస్తుంది. వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత ఎక్కువగా పండ్లరసాలు, సూప్స్, కొబ్బరినీళ్లు తాగడం వల్ల శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది.
వీలైనంత వరకు తాజా పండ్లు, ఆకు కూరలు, పండ్లరసాలు తీసుకుంటూ మన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచాలి. ముఖ్యంగా వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత మద్యానికి దూరంగా ఉండాలి. ఈ విధంగా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మద్యం తాగటం వల్ల మన రోగనిరోధక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అలాగే ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ కి కూడా దూరంగా ఉండటం ఎంతో మంచిది.
Tufan9 Telugu News And Updates Breaking News All over World