Jaggery Benifits : బెల్లాన్ని ఇలా వాడితే.. మలబద్ధకం, ఊబకాయం వంటి సమస్యలకు చెక్!

Updated on: January 22, 2024

Jaggery Benifits : తియ్యగా ఉండే బెల్లం గురించి అందరికీ తెలుసు. అయితే దాని వల్ల కల్గే లాబాలు కూడా మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే చక్కెరకు బదులుగా బెల్లాన్ని ఎక్కువగా వాడటం వల్ల అనేక లాభాలు ఉంటాయి. ప్రతిరోజూ ఉదయం లేవగానే టీ, కాఫీలకు బదులుగా గోరు వెచ్చని నీటిలో బెల్లం వేస్కొని ఖాలీ కడుపుతో తాగితే దాని ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి.

ముఖ్యంగా బెల్లంలో విటామిన్ బి1, బి6, సి, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, సోడియం వంటి అనేక పోషకాలు బెల్లంలో ఉన్నాయి. ఈ పోషకాలన్నీ ఏదో విధంగా మన శరీరానికి మేలు చేసేవే. ఈరోజుల్లో చాలా మంది మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారు. వారు నిద్ర లేచిన తర్వాత కాలకృత్యాలు ముగించుకొని.. ఖాలీ కడుపుతో బెల్లం నీటిని తాగాలి. ఇళా చేస్తే ఉదయాన్ని సుఖ విరేచనం అవుతుంది.

Jaggery Benifits
Jaggery Benifits

బెల్లం నీటిలో కిడ్నీకి సంబంధించిన సమస్యలు కూడా రావు. ఇది శరీరాన్ని డిటాక్సిపై చేస్తుంది. గోరు వెచ్చని నీటిలో బెల్లం కలిపి తీస్కుంటే శరీరంలో ఉండే మలినాలు సులభంగా తొలగిపోతాయి. ఊబకాయంతో బాధపడేవారు ఉదయాన్నే బెల్లం నీటిని తాగడం అలవాటు చేస్కోవాలి. క్రమం తప్పకుండా ఇలా చేస్తుంటే… కొన్ని రోజుల్లోనే మీరు చాలా బరువు తగ్గుతారు. బెల్లంలో విటామిన్ సి కూడా ఉంటుంది. దీన్ని వేడి నీళ్లలో కలిపి తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఆక్సీకరణ ఒత్తిడికి గురి కాకుండా కాపాడుతుంది. శరీరాన్ని శాంతపరుస్తుంది.

Advertisement

Read Also : Sprouts : మొలకెత్తిన విత్తనాలు తినటంలో ఈ పొరపాటు అస్సలు చేయకండి..!

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel