Sreeja Third Marriage : టాలీవుడ్‌లో పెళ్లిళ్ల రచ్చ మొదలైంది. సెలబిట్రీల పెళ్లిళ్లు హాట్ టాపిక్‌గా మారాయి. రెండు పెళ్లిళ్లు, మూడు పెళ్లిళ్లు అంటూ రోజుకో సెలబ్రిటీ పేరు బయటకు వస్తోంది. సెలబ్రిటీల్లో చాలామంది పెళ్లిళ్లు చేసుకోవడం వెంటనే బ్రేకప్ అవ్వడం… పెళ్లి అయి రెండేళ్లు మూడేళ్లు గడవకముందే విడాకులు తీసుకోవడం కామన్ అయిపోయింది. మెగా ఫ్యామిలీలో చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కొణిదెల మూడో పెళ్లి చేసుకోబోతుందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. శ్రీజ మొదటి పెళ్లి మెగా ఫ్యామిలీకి తెలియకుండా చేసుకుని కొన్నాళ్లకే విడాకులు తీసుకుంది. ఆ తర్వాత కల్యాణ్ దేవ్‌ను రెండో వివాహం చేసుకుంది శ్రీజ..
Mega Daughter Sreeja Konidela third marriage Matter News Viral on Social Media
కొన్నాళ్ల పాటు వీరిద్దరి సంసారం బాగానే సాగింది. ఏమైందో ఏమో కానీ, కొన్ని నెలలుగా వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నారు. శ్రీజ, కల్యాణ్ దేవ్ సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్టులను బట్టి చూస్తే.. విడిపోవాలని గట్టిగా నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. ఇప్పుడు మెగా అభిమానులకు మరో షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. శ్రీజ కొణిదెల మూడో పెళ్లికి రెడి అయిందనే వార్త టాలీవుడ్‌లో హల్ చల్ చేస్తోంది.
Sreeja Third Marriage : శ్రీజ పెళ్లికి చిరు గ్రీన్ సిగ్నల్.. మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి..!
Mega Daughter Sreeja Konidela third marriage Matter News Viral on Social Media
ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్న శ్రీజను.. మరో పెళ్లి చేయడంలో మెగా స్టార్ చిరంజీవి ఆసక్తిగా లేరట.. మూడో పెళ్లికి చేయడం చిరుకు అసలే ఇష్టం లేదట.. కానీ, శ్రీజ మూడో పెళ్లి విషయంలో తమ్ముడు పవర్ స్టార్ జోక్యంతో చిరంజీవి ఒప్పుకున్నట్టు టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. మన కూతురు సంతోషం కన్నా ఏది ఎక్కువ కాదని పవన్ చెప్పడంతో చిరంజీవి శ్రీజ మూడో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. అంటే.. మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి మొదలు కాబోతోంది.
శ్రావణ మాసంలో పెళ్లిపీటలెక్కనున్న చిరు కుమార్తె :
Mega Daughter Sreeja Konidela third marriage Matter News Viral on Social Media
వచ్చే శ్రావణ మాసంలోనే శ్రీజ కొణిదెల మూడో పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ ఆ మూడో భర్త ఎవరంటే.. తన చిన్ననాటి క్లోజ్ ఫ్రెండ్ అంట.. అతడితోనే శ్రీజ మూడో పెళ్లి చేసుకోబోతుందని టాక్ వినిపిస్తోంది. ముందుగా శ్రావణమాసంలో ఎంగేజ్‌మెంట్ జరిపించనున్నారు.. నవంబర్ లో శ్రీజ పెళ్లిపీటలు ఎక్కబోతుందంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకూ ఈ విషయంలో మెగా ఫ్యామిలీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
Mega Daughter Sreeja Konidela third marriage Matter News Viral on Social Media
ఇదిలా ఉంటే.. వాస్తవానికి శ్రీజ ఇంకా రెండో భర్త అయిన కల్యాణ్ దేవ్ నుంచి అధికారికంగా విడాకులు తీసుకోలేదు. రెండో భర్త కల్యాణ్ కూడా తమ విడాకులపై స్పందించలేదు. కానీ, మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడని వార్తలు వచ్చాయి. గత వారం నుంచి శ్రీజా మూడో పెళ్లి అంటూ రుమర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కొంతమంది సీనియర్ నటీనటులు శ్రీజ మూడో పెళ్లి చేసుకోకపోవడమే మంచిదని అభిప్రాయపడ్డారు.
Read Also : Sreeja Kalyan Dev : శ్రీజ కూతురితో కనిపించిన కల్యాణ్ దేవ్.. ఇద్దరూ ఒక్కటయ్యారా.? వీడియో!