Director Raghavendra Rao : దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు (K. Raghavendra Rao) గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎన్నో హిట్ మూవీలకు దర్శకుడిగా వ్యవహరించారు. అద్భుతమైన మూవీలతో తనకుంటూ గుర్తింపు తెచ్చుకున్నారు రాఘవేంద్ర.. రాఘవేంద్రరావు మూవీలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. సాధారణంగా రాఘవేంద్ర రావు తీసిన చాలా సినిమాల్లో బొడ్డుపై పండు అనేది పెట్టింది పేరు.
రొమాంటిక్ మూవీలను తీయడంలో ఈయనకంటే మరొకరు సాటిరారు. అలాగే భక్తిపరమైన మూవీలను కూడా దర్శకేంద్రుడికే సాధ్యం.. ఆయన తీసిన అన్నమయ్య, శ్రీరామదాసు మూవీలతో మెప్పించారు. రాఘవేంద్ర రావు మూవీలకు అనేక అవార్డులు వచ్చాయి. ప్రస్తుతం ఆయన మూవీలు తీయడం లేదు. ఇటీవలే వాంటెడ్ రొమాంటిక్ మూవీతో ముందుకువచ్చారు. ఈ మూవీకు కూడా ఫుల్ రెస్పాన్స్ వచ్చింది.
Director Raghavendra Rao : దర్శకేంద్రుడు B.A అని ఎందుకు ఉండేదంటే?
వాంటెడ్ పండుగాడు మూవీకి సంబంధించి ప్రమోషన్స్ సందర్భంగా దర్శకేంద్రుడు అనేక ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. రాఘవేంద్ర రావు తీసిన మూవీలను చూస్తే.. సినిమా టైటిల్స్ పడే సమయంలో దర్శకుడు రాఘవేంద్రరావు బి.ఎ అని ఉంటుంది. ఇంతకీ పేరు తర్వాత డిగ్రీ ఎలా వచ్చిందో కూడా చెప్పుకొచ్చారు. ఒకవేళ తాను డైరెక్టర్ కాకుంటే మాత్రం డ్రైవర్ గా సెటిల్ అయి ఉండేవాడినని రాఘవేంద్రరావు తెలిపారు. ఆ రోజుల్లో బీఏ చదివిన వాళ్ల కన్నా ఎక్కువ సంపాదన డ్రైవర్లకే వచ్చేదట..
అందుకే తాను డ్రైవర్ కావాలని అనుకున్నారట.. ఎందుకు డ్రైవర్ కావలనుకున్నారంటే.. తనకు డ్రైవింగ్ వచ్చు కాబట్టి అంటూ సరదాగా చెప్పుకొచ్చారు. ఇంతకీ పేరు చివర బీఏ ఎందుకు పెట్టారంటే.. అలా పెట్టిన రెండు మూవీలు సూపర్ హిట్ అయ్యాయి. అదే సెంట్‌మెంట్ అన్ని సినిమాల్లోనూ కొనసాగించానని తెలిపారు. తాను తీసిన ఓ సినిమాకు బీఏ అని పెట్టలేదట.. ఆ మూవీ ప్లాప్ అయింది. అందుకే తన పేరు పక్కన బీఏ పెట్టుకుంటున్నానని చెప్పుకొచ్చారు.