Crime news: భర్త తరచూ తనను అనుమానించడాన్ని జీర్ణించుకోలేకపోయింది. ఎత చెప్పినా అతడు వినకపోవడంో బాధతో పుట్టింటికి చేరింది. ఏమైందని తల్లి అడగ్గా తన మనసులోని మాటలు చెప్పి భారాన్ని దించుకుంది. అయితే అల్లుడు కూతురును అనుమానిస్తాన్నడని తెలుసుకున్న ఆ తల్లి.. అతడిని మార్చి కూతురుకు మంచి జీవితాన్ని అందించాలనుకుంది. బావను భయపెట్టి చెల్లి జీవితం బాగుపడేలా చేయమని కొడుక్కు చెప్పింది. అదే వారి చేసిన తప్పు. కోపంతో వెళ్లిన కుమారుడు బావపై విరుచుకుపడ్డాడు. నా చెల్లినే అనుమానిస్తావా అంటూ చితకబాదాడు. ఈ క్రమంలోనే అతడు చనిపోయాడు.
కర్ణాటకలోని మండ్యకు చెందిన మహేష్ కు అదే గ్రామానికి చెందిన శిల్పతో ఎనిమిదేళ్ల క్రితం పెళ్లి జరిగింది. బెంగళూరులో కోణనకుంటెలో నివాసం ఉంటున్నారు. అయితే పని నిమిత్తం మహేళ్ మండ్యలో ఉంటూ అప్పుడప్పడూ బెంగళూరుకు వచ్చేవాడు. ఈ క్రమంలోనే భార్యపై విపరీతమైన అనుమానం పెంచుకున్నాడు. అది తట్టుకోలేని శిల్ప పుట్టింటికి వెళ్లి తల్లికి విషయం చెప్పింది. అది కాస్త ఆమె అన్నకు తెలియడంతో బావను భయపెట్టి చెల్లి జీవితం బాగు చేయాలనుకున్నాడు. ఈ క్రమంలోనే బావను విపరీతంగా కొట్టాడు. అది తట్టుకోలేక అతడు మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు శిల్పతో పాటు ఆమె తల్లిని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు అయిన బాలాజీ పరారీలో ఉన్నాడు.