Extra Marital Affair : ఆ విషయం బయట పడుతుందని కన్న కూతురునే కడతేర్చిన కసాయి తల్లి..!

Updated on: February 16, 2022

Extra Marital Affair : కామంతో కళ్ళు మూసుకుపోయిన కొందరు వావి వరుసలు మర్చిపోయి ఘాతుకాలకు పాల్పడుతున్నారు. వివాహేతర సంబంధం ముసుగులో తమ సంబంధం బయటపడుతుందన్న కారణంతో హత్యలు చేయడానికీ కొందరు వెనుకాడటం లేదు. కన్న బిడ్డలని కూడా కడతేర్చడానికి వెనుకాడడం లేదంటే వారు ఇంతకు దిగజారిపోతున్నారో ఆలోచించాలి.

తాజాగా తెలంగాణ లోని ఖమ్మం జిల్లా బోనకల్లు మండలానికి చెందిన పాలెపు నరసింహారావు కుమారుడికి సునీత అనే మహిళతో వివాహమైంది. సునీతకు 12 ఏళ్ల కూతురు ఉంది. కొంతకాలంగా సునీతకు ఆమె మామ నరసింహారావుతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో వీరిద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో బాలిక చూసింది. దీంతో సునీత.. తన మామతో కలిసి కన్న కూతురిని కాళ్లు, చేతులు కట్టేసి వైరుతో గొంతు బిగించి తన మామతో కలిసి చిన్నారిని దారుణంగా హత్య చేసింది.

Advertisement

ఆ హత్యను సహజ మరణంగా చిత్రీకరించేందుకు సునీత, ఆమె మామ ఇద్దరూ అన్ని ప్రయత్నాలు చేశారు. బాలికకు అనారోగ్యంగా ఉందని, స్థానిక పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరిశీలించి అప్పటికే చనిపోయిందని నిర్ధారించారు. పీహెచ్‌సీలో చనిపోయినట్లు నిర్ధారించకూడదని.. వెంటనే ఖమ్మం తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు చెప్పారు. ఖమ్మం తీసుకెళ్లగా.. అక్కడి వైద్యులు కూడా చిన్నారి చనిపోయిందని నిర్ధరించారు. తల్లి, తాత బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం చేయకుండా తమకు అప్పగించాలని వైద్యులను కోరారు. చిన్నారి మెడపై వైరు బిగుసుకుపోయిన గుర్తులు ఉండటంతో వైద్యులకు అనుమానం కలిగింది. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై కవిత సంఘటనా స్థలాన్ని పరిశీలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

పోస్టుమార్టం నిర్వహిస్తే అసలు విషయం బయట పడుతుందని ఆపేందుకు శతవిధాలా ప్రయత్నించారు. చిన్న పిల్లను కోయడం మంచిది కాదని, చూసి తట్టుకోలేమని ప్రాధేయపడ్డాడు. పోలీసులు, వైద్యులు అంగీకరించకుండా పోస్టుమార్టం చేశారు. అసలు విషయం బయట పడుతుండటంతో తప్పించుకునేందుకు గ్రామంలో మరో యువకుణ్ని ఇరికించాడు. ఆ యువకుడికి తన కోడలికి వివాహేతర సంబంధం ఉందని అతనే చంపాడని కోడలితో పోలీసులకు చెప్పించారు. అతణ్ని విచారించగా వివాహేతర సంబంధం నిజమేనని కాని హత్యతో తనకు సంబంధం లేదని చెప్పాడు. పోలీసులు ఆధారాలు సేకరించి తల్లి సునీతను ప్రశ్నించడంతో విషయం బయటపడింది. అప్పటికే పోస్టుమార్టం నివేదికలో బాలిక హత్యకు గురైనట్లు నిర్ధరణ అయింది. నిందితులు నేరం అంగీకరించడంతో హత్య కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు ఏసీపీ చెప్పారు.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel