...

Actress Meena : నా భర్త మృతి పై అసత్యాలు ఆపండి.. బాగోద్వేగాపూరితమైన లేఖ రాసిన మీనా?

Actress Meena : తెలుగు తమిళ భాషలలో అగ్రతారగా ఓ వెలుగు వెలిగిన నటి మీనా భర్త విద్యాసాగర్ మరణ వార్త అందరిని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ క్రమంలోనే ఈమె తాను ఎంతగానో ప్రేమించిన భర్త మృతి చెందడంతో ఎంతో కృంగిపోతున్నారు. అయితే విద్యాసాగర్ మరణం గురించి సోషల్ మీడియాలో కట్టకథలు వెళ్లవెత్తుతున్నాయి.ఆయన మరణానికి కారణం పావురాలేనని పావురాల వల్ల ఇన్ఫెక్షన్ అధికమై చనిపోయారంటూ వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా ఆయన ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారని, పోస్ట్ కోవిడ్ కారణంగా మృతి చెందారంటూ పలు కారణాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Advertisement
actress-meena-stop-writing-my-husband-death-meena-wrote-an-emotional-letter
actress-meena-stop-writing-my-husband-death-meena-wrote-an-emotional-letter

ఇకపోతే తన భర్త మరణ వార్తతో తీవ్రంగా కృంగిపోయిన గత మూడు రోజుల నుంచి సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు. ఈ క్రమంలోనే భర్త మరణం తర్వాత మొదటిసారిగా మీనా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఒక భావోద్వేగాపూరితమైన లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆమె లేఖలో స్పందిస్తూ తాను ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ప్రతి ఒక్కరూ తన వ్యక్తిగత విషయాలకు ప్రాధాన్యత ఇస్తూ తన భర్త మరణం గురించి లేనిపోని వార్తలను సృష్టించకండి అంటూ తెలియచేశారు.ప్రస్తుతం నేనున్న పరిస్థితులలో అలాంటి అవాస్తవాలను వ్యాప్తి చేయకండి అంటూ అందరిని వేడుకున్నారు.

Advertisement

ఇలాంటి కఠిన పరిస్థితులలో నా కుటుంబానికి నాకు ఎంతో మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అదేవిధంగా వైద్య బృందానికి కూడా ఈమె ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.తన భర్త ప్రాణాలను కాపాడటం కోసం ఎంతో ప్రయత్నం చేసిన వైద్య సిబ్బందికి అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి, ఆరోగ్యశాఖ మంత్రి,తనకోసం ప్రార్థించిన స్నేహితులు బంధు మిత్రులందరికీ ధన్యవాదాలు అంటూ ఈమె తన భర్త మరణం పట్ల వస్తున్న వార్తలపై రాసిన ఈ భావోద్వేగమైన లేఖ ప్రస్తుతం నెట్టింట చెక్కర్లు కొడుతుంది.ఇకపోతే నటిగా ఎంతో మంచి పాపులారిటీ ఉన్న సమయంలోనే మీన సాఫ్ట్వేర్ ఇంజనీర్ విద్యాసాగర్ ను పెళ్లి చేసుకున్నారు. వీరికి నైనిక అనే ఒక అమ్మాయి ఉంది నైనిక సైతం ఇప్పటికే బాలనటిగా వెండితెరకు పరిచయమయ్యారు.

Advertisement

Read Also : Actress Meena Husband : మీనా భర్త మృతికి పావురాలే కారణమా? అసలేం జరిగిందంటే?

Advertisement
Advertisement