...

Health Tips: అశ్వగంధం ఎక్కువగా తీసుకుంటున్నారా? అయితే ఈ ఆరోగ్య సమస్యలు తప్పవు..!

Health Tips: అశ్వగందాన్ని ఆయుర్వేదంలో రారాజుగా పరిగణిస్తారు. అశ్వగంధం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. ప్రతి రోజు ఏదో ఒక రూపంలో అశ్వగంధం తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. అయితే అశ్వగంధం పరిమితికి మించి తీసుకోవటంవల్ల అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. ఏ ఆహార పదార్థాలను అయిన మితంగా తీసుకుంటే ఆరోగ్యం.. అమితంగా తీసుకుంటే అనారోగ్య సమస్యలు తప్పవు.అశ్వగంధం కూడా ఇలాగే ఎక్కువగా తీసుకోవడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.

సాధారణంగా మధుమేహ సమస్యతో బాధపడేవారు అశ్వగంధం తగిన మోతాదులో తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కర స్థాయిలను నియంత్రిస్తుంది. అలా కాకుండా ఎక్కువ మోతాదులో అశ్వగంధం తీసుకోవటం వల్ల మధుమేహ సమస్య లేనివారికి రక్తంలో చక్కెర స్థాయిలు పూర్తిగా పడిపోయే ప్రమాదం ఉంది.

పురుషులు ఎక్కువగా అశ్వగంధం తీసుకోవటంవల్ల అంగస్తంభన సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ఫలితంగా సంతానలేమి సమస్యలతో బాధ పడాల్సి వస్తుంది. అశ్వగంధం ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీ సంబంధిత వ్యాధులు, హైపర్ థైరాయిడ్, ఉదర సంబంధిత వ్యాధులు తలెత్తే ప్రమాదం ఉంది.

అశ్వగంధం ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎక్కువ నిద్ర పడుతుంది. అశ్వగంధం ఎక్కువగా తీసుకోవడం వల్ల నోరు పొడిబారటం, చర్మం మీద అలర్జీ వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.