Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Health Tips: శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నారా? ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది..!

Health Tips: ప్రస్తుత కాలంలో వాతావరణ కాలుష్యం మారుతున్న ఆహారపు అలవాట్లు వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.పైసా వచ్చే ఆయాసం లేకుండా పుట్టిన పిల్లల దగ్గర న

By Ramesh Babu

Published on: March 8, 2022 1:37 PM

Updated on: March 9, 2022 8:58 AM

---Advertisement---

Health Tips: ప్రస్తుత కాలంలో వాతావరణ కాలుష్యం మారుతున్న ఆహారపు అలవాట్లు వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.పైసా వచ్చే ఆయాసం లేకుండా పుట్టిన పిల్లల దగ్గర నుండి ముసలివారి వరకు అనేక అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ మధ్య కాలంలో చిన్న పిల్లలు కూడా శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వారు తీసుకునే ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల సమస్య తీవ్రత ఎక్కువ కాకుండా నియంత్రించవచ్చు. శ్వాసకోస సమస్యలు ఉన్న వారు ఎలాంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.

pjimage 2022 03 08T133733.676చాలామంది మాంసాహారాన్ని ఇష్టంగా తింటుంటారు. కొంతమందికి మాంసం లేనిదే ముద్ద దిగదు. శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడే వారు మాంసాహారం తక్కువ తీసుకోవటం శ్రేయస్కరం.ముఖ్యంగా ఆస్తమా వంటి సమస్యలతో బాధపడేవారు చేపలను ఎక్కువగా తినటం వల్ల వారి సమస్య ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది . శ్వాసకోస సంబంధిత వ్యాధులతో బాధపడేవారు చేపలకు దూరంగా ఉండటం మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు.

Advertisement

పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి..పాలలో ఉండే అనేక రకాల పోషకాలు శరీర ఆరోగ్యాన్ని కాపాడటంలో ఉపయోగపడతాయి. శ్వాస సంబంధిత వ్యాధులు ఉన్నవారు పాలను ఎక్కువగా తాగటం. రోజుకు ఒకటి లేదా రెండు సార్లు కాకుండా అంతకు మించి పాలు తాగటం వల్ల దగ్గు గొంతు నొప్పి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడతాయి. అందువల్ల శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారు పాలు తక్కువ తాగటం మంచిది.

ఆస్తమా సమస్యలతో బాధపడేవారు ఆల్కహాల్ కి దూరంగా ఉండాలి. ఆస్తమా సమస్యలు ఉన్నవారు ఆల్కహాల్ తాగడం వల్ల అందులోని సల్ఫైట్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కలిగిస్తుంది. అందువల్ల ఆస్తమా వంటి సమస్యలు ఉన్నవారు బీర్, ఆల్కహాల్ తాగకపోవటం మంచిది.

, , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.