Karthika Deepam Today Episode Feb 18 : బుల్లితెరపై అత్యంత ప్రేక్షకుల ఆదరణ పొందిన సీరియల్ కార్తీక్ దీపం మరి నేటి ఎపిసోడ్ హైలెట్స్ ఏంటో చూద్దాం. చనిపోయిన హిమను తీసుకుని వచ్చి మోనితకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన మోనిత వాళ్లబాబాయ్. మోనిత ఏం ప్లాన్ చెయ్యబోతుంది. కార్తీక్ మోనిత వాళ్లబాబాయ్‌కి ఆపరేషన్ చేస్తాడానేది చూసేద్దాం.
ఇక స్టోరీలోకి వస్తే బస్తీలో ఆసుపత్రి బోర్డ్ తీయించినందుకు దీపతో గొడవ పడడానికి వస్తుంది మోనిత. అదే సమయంలో కార్తిక్ ఆనందరావుతో ఆడుకుంటుంటాడు. దానికి మోనిత ఏంటి కార్తిక్ తమ్ముడి కొడుకుతూ ఆడుకుంటున్నావ్ మన కొడుకుతో ఎప్పుడైనా ఆడుకుంటున్నావా అని అంటుంది. వాడు ఆదిత్య కొడుకు కాదు అని చెప్పుబోతుండగా శ్రావ్య వచ్చి బాబుని తీసుకెళ్తుంది. ఏంటి ఇలా వచ్చావ్ అని అడుగుతాడు కార్తీక్ వంద కారణాలుంటాయి అంటుంది మోనిత.. అంతలో దీప వస్తుంది ఏంటి బోర్డు తీయించావ్ అంటే నీ ఇష్టం వచ్చింది చేసుకో అంటూ దీప తెగేసి చెప్తుంది.
మోనిత డాక్టర్ అసోషియన్‌తో మాట్లాడి నీ లైసెన్స్ తిరిగి ఇప్పించడం వెనుక మోనిత ఏదో కుట్ర చేస్తుందని కార్తీక్‌తో దీప చెప్తుంది. ఆ కుట్రను నేను బయటపెడతాను అంటుంది.
మోనితవాళ్లబాబాయ్ అటుగా వెళ్తున్న వారణాసిని పిలిచి ఎందుకు హాస్పటల్ బోర్డ్ చించేశావ్ అని అడుగుతాడు. దానికి వారణాసి దీపక్క చెప్పిందని చెప్తాడు. మోనిత పెళ్లికాకుండానే కృత్రిమ గర్భం దాల్చిందని ఆకుట్రను దీపక్క బయటపెట్టందని… మోనిత టార్చర్ వల్లే డాక్టర్‌బాబు దీపక్క ఇళ్లు విడిచి వెళ్లారని చెప్తాడు. కానీ ఈ బస్తీవాళ్లు నిజానిజాలేమీ తెలుసుకోకుండా మోనితను నమ్ముతున్నారని చెప్తాడు వారణాసి.
దానితో మోనిత వాళ్లబాబాయ్ మోనిత ఇంక మారదని.. ఇంతకు ముందు కూడా తనను చంపడానికి చూసిందని కానీ ఇప్పుడే కుట్ర లేకుండా నాకు ఆపరేషన్ చేస్తుందాని ఆలోచిస్తుంటాడు. ఇంక మోనిత వచ్చి రేపే నీకు ఆపరేషన్ బాబాయ్ అని చెప్తుంది. దానికి మోనితవాళ్ల బాబాయ్ నన్ను అమెరికాలో కన్నకూతురిలా ఒక అమ్మాయి చూసుకుందని తనను నా ఆపరేషన్ కంటే ముందే ఇక్కడ ఉండమని అడిగాను అని చెప్తాడు. సరే బాబాయ్ తను వచ్చేసరికి లేట్ అవుతుంది కదా అంటుంది. కాదమ్మా తను ఇక్కడే ముంబైలో ఉంది అని అంటాడు తాను రేపే ఇక్కడకు వస్తుందని చెప్తాడు.
తరువాత రోజు మోనిత.. కార్తీక్ ఇంక నువ్ నాకే సొంతం కాబోతున్నావ్. దీప పని అయిపోతుంది నా ప్లాన్‌తో అని ఆలోచిస్తూ తెగ సంతోషిస్తుంది. అంతలో మోనిత వాళ్ల బాబాయ్ తాను చెప్పిన అమ్మాయి వచ్చిందని చెప్తాడు ఆ అమ్మాయిని చూడగానే మోనితకు ఒక్కసారిగా దిమ్మతిరిగిపోతుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు కార్తీక్ కాలేజీ రోజుల్లో ప్రేమించిన హిమ. ఈ అమ్మాయి నీకెలా తెలుసు అని అడుగుతుంది మోనిత దానికి వాళ్లబాబాయ్ ఈ అమ్మాయి పేరు మహాలక్ష్మి అని.. తను అమెరికాలో నా పక్క ప్లాట్‌లోనే ఉండేదని తనకు ఎవరూ లేరని చిన్న ఉద్యోగం చేసుకుంటూ జీవిస్తుందని చెప్తాడు. తనను సొంత తండ్రి కన్నా ఎక్కువగా చూసుకుంటుందని చెప్తాడు. మరి తర్వాత స్టోరీ ఎలా ఉంటుందనే చూడాలి.
Read Also : Karthika Deepam : మోనితకు ఊహించని షాక్… దీపతో చేతులు కలిపిన మోనిత వాళ్ల బాబాయ్…!
Tufan9 Telugu News And Updates Breaking News All over World