...

Karthika Deepam : మోనితకు ఊహించని షాక్‌… దీపతో చేతులు కలిపిన మోనిత వాళ్ల బాబాయ్‌…!

Karthika Deepam : బుల్లితెరపై టాప్ లెవెల్ లో దూసుకుపోతున్న ” కార్తీక దీపం ” సీరియల్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. మోనిత వేసిన ప్లాన్‌ దీప ద్వారా తెలుసుకుని మోనితకు ఊహించని షాక్‌ ఇచ్చిన మోనిత బాబాయ్‌. మరి 17 ఫిబ్రవరి 2022 నేటి హైలెట్స్‌ చూసేద్దామా..!

Advertisement

మోనిత వాళ్ల బాబాయ్‌కి గుండె సర్జరీ చెయ్యమని కార్తీక్‌ని బతిమాలిన సంగతి తెలిసిందే. దానికి ప్రతిఫలంగా బస్తీలో పెట్టిన హాస్పట్‌లను తీసేస్తానని కార్తీక్‌ని నమ్మిస్తుంది మోనిత. బస్తీలో మోనిత ఆసుపత్రి గురించి తెసుకున్న దీప.. వారణాసితో కలిసి బస్తీలోని ఆసుపత్రి బోర్డును చించేయిస్తుంది. మోనిత వాళ్లబాబాయ్‌ మోనిత రాగానే జరిగిన సంగతంతా చెప్తాడు.

Advertisement

ఇక అరుణ వారణాసితో కలిసి దీపే ఇదంతా చేయించిందని మోనితతో చెప్తుంది. దానితో ఉక్రోషంతో మోనిత దీప దగ్గరకు వెళ్తుంది. అక్కడికి వెళ్లే సరిగి కార్తిక్‌ ఆనందరావుతో ఆడుకుంటూ ఉంటాడు. బాబు తన బాబే అని గ్రహించక మోనిత దీపక్క దీపక్క అని గట్టిగట్టిగా అరుస్తూ దీపతో గొడవపడుతుంది. ఎందుకు బోర్డు చించేయించావ్‌ అని అరుస్తుంది దానికి దీప ఇక నుంచి కొత్త దీపను చూస్తావ్‌ అంటూ ఎదురు సమాధానం ఇస్తుంది. చూస్తా ఏం చేస్తావో నేను చూస్తా నీకు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో నేనూ చూస్తా అంటూ మోనిత వెళ్లిపోతుంది.

Advertisement

కార్తీక్‌ దీపను అలా ఎందుకు చేయించావ్‌ అని అడుగుతాడు. దానికి మోనిత కుట్ర చేస్తుందని డాక్టర్‌ బాబుకు చెప్తుంది. ఇంక కార్తీక్‌ దీపతో మోనిత.. వాళ్ల బాబాయ్‌ సర్జరీ గురించి అడిగిన విషయం చెప్తాడు దానికి దీప మోనిత వాళ్ల బాబాయ్‌ ఆపరేషన్‌ అడ్డంపెట్టుకుని నాటకం ఆడుతుందని తన మాటలను నమ్మవద్దని చెప్తుంది. దానితో కార్తీక్‌ కూడా ఆలోచనలో పడతాడు.. మోనిత కొత్త ప్లాన్‌ ఏమైనా వేసిందా అని ఆలోచిస్తూ ఉంటాడు.

Advertisement

ఇంక మోనితని వాళ్ల బాబాయ్‌ సందేహిస్తూ ఉంటాడు. అలా ఆలోచిస్తూ గుడిలోకి వెళ్తాడు.. నిజంగా కార్తీక్‌ మోనితల పెళ్లి జరిగిందా అనుకుంటూ ఉండగా అక్కడే కనిపించిన దీపను చూసి తాను మోనిత వాళ్ల బాబాయ్‌ అని చెప్తాడు. మోనిత కార్తీక్‌ల పెళ్లిగురించి దీపను అడిగి తెలుసుకుంటాడు. ఇంక జరిగినదంతా దీప ద్వారా తెలుసుకున్న మోనిత వాళ్లబాబాయ్‌ దీపతో చేతులు కలుపుతాడు. మోనిత ఏం చేసినా ఏం ప్లాన్‌ వేస్తున్నా చెప్తాను అని చెప్తాడు. ఇంక దీప మోనిత వాళ్లబాబాయ్‌ కలిసి ఏం చెయ్యబోతున్నారు అనేది తరువాత ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.

Advertisement
Advertisement