Anchor anasuya: న్యూయార్క్ మేయర్ తో తగ్గేదే లే అంటున్న యాంకర్ అనసూయ, ఏమైందంటే?

Anchor anasuya: యాంకర్ అనసూయ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలెంటెడ్, మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ బోల్డ్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న ఈమె.. ఇటీవల న్యూయార్క్ వెళ్లింది. అక్కడి తెలుగు సంఘం దసరా పండుగ సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరు అయింది. అనసూయతో పాటు సింగర్ మంగ్లీ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంటుకుంది. అయితే అక్కడి తెలుగు వాళ్లతో కలిసి బతుకమ్మ ఆడారు. అలాగే అక్కడి మేయర్ తో కలిసి పుష్ప సినిమాలోని తగ్గేదేలే డైలాగ్ చెప్పారు. అక్కడి వాళ్లందరితో కలిసి అనసూయ పుష్ప గెస్సర్ చేశారు.

ఇందుకు సంబంధించిన వీడియోని న్యూయార్క్ మేయర్ కార్యాలయ అధికారిక ఖాతాలో షేర్ చేశారు. ఈ కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేసినందుకు అనసూయకు, మంగ్లీకి ధన్యవాదాలు అంటూ పుష్ప ది రూల్ అనే పేరుతో రాసుకొచ్చారు. ఈ వీడియోపై అభిమాని స్పందిస్తూ… మా భారతీయ చిత్రం పుష్పపై ప్రేమని, అభిమానాన్ని చూపించినందుకు న్యూయార్క్ మేయర్ కి ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశాడు.

Advertisement

ఈ సినిమాలో జంటగా నటించిన అల్లు అర్జున్ కు, రష్మిక మందన్నాకు దేశ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. లక్షల సంఖ్యలో అభిమానులు అయ్యారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన పార్ట్ టూని త్వరలోనే ప్రారంభించి ఏకధాటిగా చిత్రాన్ని పూర్తి చేయనున్నట్లు సమాచారం.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel