Bigg Boss season 6 telugu : బిగ్ బాస్ షో గాడిలో పడింది. ఆట మంచి రసవత్తరంగా సాగుతోంది. నాలుగో వారం కెప్టెన్సీ టాస్క్ మంచి ఎంటర్ టైన్మెంట్ ఇచ్చింది. ఈ టాస్కులో కీర్తి, శ్రీసత్య, సుదీప ముగ్గురూ కెప్టెన్సీ కోసం పోటీ పడ్డారు. నంబర్ గేమ్ లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి ఆఖరి వరకు పోటీ పడ్డ కీర్తి.. నాలుగో కెప్టెన్ గా నిలిచింది. మరోవైపు మన ఓవరాక్షన్ స్టార్ శ్రీహాన్ ఎప్పట్లాగే పొద్దుపొద్దున్నే తన పర్ఫార్మెన్స్ చూపించడం మొదలు పెట్టాడు. ఆ సమయంలో మరే కంటెస్టెంట్ మంచి ఫుటేజీ ఇవ్వకపోవడంతో బిగ్ బాస్ కెమెరాలన్నీ తన వైపే పెట్టి తన ఓవరాక్షన్ అంతా చూపించాడు. తన ఫోటో దగ్గరకు పోయి.. ఇంట్లో వాళ్లు నిన్ను కొట్టాలని చూస్తున్నారని, అలర్ట్ గా ఉండాలని తనకు తానే చెప్పుకున్నాడు. తన మిగతా వారి ఫోటోల ముందుకు వెళ్లి వారిని ఇమిటేట్ చేసేందుకు ప్రయత్నించాడు.

శ్రీసత్య గురించి అర్జున్ కల్యాణ్ కక్కుర్తి వ్యవహారాలపై రోహిత్, మెరీన్, కీర్తి, ఆరోహిల మధ్య తెగ చర్చ నడిచింది. అర్జున్ కల్యాణ్ శ్రీ సత్య కోసం పడిచస్తున్నాడని.. తన దగ్గర ఉన్నదంతా ఆమెకు ఇచ్చేస్తున్నాడని వారు గుసగుసలాడారు. శ్రీసత్యని టచ్ చేయనిస్తే.. ముద్దు ఇస్తే డబ్బులిస్తానని అర్జున్ అన్నాడట.. ఆమె దానికి ఒప్పుకుందట.. అందుకే తన వద్ద ఉన్న మొత్తం డబ్బులను శ్రీసత్యకు ఇచ్చాడట అని చెవులు కొరుక్కున్నారు.
Read Also : Bigg Boss 6 Telugu : చెత్త ఆటగాడు అర్జున్ కళ్యాణే.. తేల్చేసిన బిగ్ బాస్ ఇంటి సభ్యులు