Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ హౌస్‌లో రొమాంటిక్ కపుల్ రచ్చ.. తెగ తిట్టేసుకున్నారుగా..

Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ 6 అట్టహాసంగా ప్రారంభం అయింది. ఎప్పుడెప్పుడా అని చూస్తున్న రియాల్టీ షో మళ్లీ రానే వచ్చింది. బిగ్ బాస్ అభిమానులు ఈ సారి ఈ రియాలిటీ షోపై భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. దానికి తగ్గట్లుగానే బిగ్ బాస్ ప్రోగ్రాం తీర్చిదిద్దినట్లు కనిపిస్తోంది. ఎప్పుడూ లేనంతగా ఈసారి 20 మంది కంటెస్టెంట్లు హౌజ్ లోకి అడుగు పెట్టారు. ఈ సారి గ్లామర్ ఎక్కువగా ఉండేలా చూసుకున్నారు. ఈ క్రమంలోనే ... Read more

By Vinod Kumar

Published on: September 7, 2022 2:00 PM

Updated on: September 7, 2022 3:08 PM

Bigg Boss 6 Telugu couple rohit and marina starts fighting

---Advertisement---

Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ 6 అట్టహాసంగా ప్రారంభం అయింది. ఎప్పుడెప్పుడా అని చూస్తున్న రియాల్టీ షో మళ్లీ రానే వచ్చింది. బిగ్ బాస్ అభిమానులు ఈ సారి ఈ రియాలిటీ షోపై భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. దానికి తగ్గట్లుగానే బిగ్ బాస్ ప్రోగ్రాం తీర్చిదిద్దినట్లు కనిపిస్తోంది. ఎప్పుడూ లేనంతగా ఈసారి 20 మంది కంటెస్టెంట్లు హౌజ్ లోకి అడుగు పెట్టారు. ఈ సారి గ్లామర్ ఎక్కువగా ఉండేలా చూసుకున్నారు. ఈ క్రమంలోనే ఓ క్యూట్ కపుల్ ను కూడా బిగ్ బాస్ హౌజ్ లోకి పంపించారు. వారి పేరే మెరీనా, రోహిత్.

Bigg Boss 6 Telugu couple rohit and marina starts fighting
Bigg Boss 6 Telugu couple rohit and marina starts fighting

Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ హౌస్‌లో మెగుడు పెళ్లాల కొట్లాట…

అంతకుముందు బిగ్ బాస్ సీజన్ 3 లో వరుణ్ సందేశ్, వితికలు భార్యా భర్తలుగా హౌజ్ లోకి వచ్చారు. వాళ్లు మొదట్లో చాలా అన్యోన్యంగా ఉన్నారు. తర్వాత్తర్వాత వారి మధ్య గొడవలు జరిగాయి. అదే ఇప్పుడు తాజాగా హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మెరీనా, రోహిత్ లు మాత్రం హౌజ్ లోకి వచ్చిన మొదటి నుండే గొడవలు పెట్టుకుంటున్నారు. క్యూట్ కపుల్ గా బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చి.. అచ్చంగా భార్య భర్తలు ఎలా ఉండాలో అలాగే గొడవలు పడుతూ అరుచుకుంటూ హౌజ్ లో రచ్చ చేస్తున్నారు.

Advertisement

వాష్ రూమ్ దగ్గర రోహిత్ కు ఏదో చెప్పబోయింది మెరీనా. కానీ మెరీనా చెప్పేది రోహిత్ పట్టించుకోలేదు. తన బాడీ చూసుకుంటూ ఉండిపోయాడు. దీంతో మెరీనాకు చిర్రెత్తుకొచ్చింది. నువ్వు నీ బాడీ చూసుకో అంటూ కోపంగా వెళ్లిపోయేందుకు సిద్దమైంది. అప్పుడు రోహిత్ మెరీనాను ఓవరాక్షన్ చేయకు అంటూ తనను ఆపే ప్రయత్నం చేసి.. తర్వాత నువ్వెప్పుడు ఇలాగే అంటూ తన పనిలో మునిగిపోయాడు.

Read Also : Arjun Kalyan : ఆ హీరోయిన్ తో ప్రేమాయణం నడిపిన బిగ్ బాస్ 6 కంటెస్టెంట్ అర్జున్ కళ్యాణ్… ఆమె ఎవరంటే?

, , , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.