Samrat Reddy : బిగ్ బాస్ ఫేం సామ్రాట్ రెడ్డి గురించి తెలుగు ప్రక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పలు సినిమాల్లో హీరోగా నటిస్తూ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే మొదటి భార్యతో విడిపోయిన తర్వాత బిగ్ బాస్ కు వచ్చాడు. అప్పుడు తేజస్వి మడివాడతో చాలా క్లోజ్ గా ఉన్నాడు. వారిద్దరి మధ్య ఉన్న రిలేషన్, ప్రేమ చూసి అందరూ వారు పెళ్లి చేస్కుంటారేమో అనుకున్నారు.
కానీ బిగ్ బాస్ నుంచి వారిద్దరూ బయటకు వచ్చేశాక.. ఎవరి దారిని వాళ్లున్నారు. తేజస్వి మడివాడతో ఫ్రెండ్ షిప్ ను కంటిన్యూ చేయలేకపోయారు. అలా వారిద్దరి మధ్య వచ్చిన అనేక వార్తలకు చెక్ పడింది. ఆ తర్వాత సామ్రాట్ అంజనా శ్రీలిఖిత అనే అమ్మాయిని రెండో పెళ్లి చేస్కున్నాడు. వారికి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు.
ఈ క్రమంలోనే ఆగస్టు 15వ తేదీ పంద్రాగస్టు నాడు తండ్రయ్యాడు. పండంటి ఆడ బిడ్డకు సామ్రాట్ భార్య లిఖిత జన్మనిచ్చింది. సామ్రాట్ తన పాపను ఎత్తుకొని ఉన్న ఫోటోను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. స్వాతంత్ర్య దినోత్సవం రోజే నాకు పండంటి పాప పుట్టిందంటూ ఇన్ స్టా గ్రామ్ వేదికాగా పోస్ట్ చేశాడు. విషయం తెలుసుకున్న పలువురు నెటిజెన్లు, ప్రముఖులు సామ్రాట్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Read Also :Samrat reddy : తండ్రి కాబోతున్న సామ్రాట్.. బేబీ బంప్ ఫొటోలతో శ్రీలిఖిత!