Samrat reddy : బిగ్ బాస్ ఫేమ్ సామ్రాట్ రెడ్డి తన అభిమానులకు ఓ శుభవార్త చెప్పారు. త్వరలోనే తాను తండ్రి కాబోతున్నట్లు వివరించారు. మా చిన్ని బంగారం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నామంటూ తన భార్య శ్రీ లిఖిత బేబీ బంప్ ఫొటోలను షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ ఫొటోలు చూసిన ప్రతీ ఒక్కరూ శుభాకాంక్షలు తెలపారు. త్వరలోనే పండంటి బిడ్డ పుట్టాలని కోరుకుంటున్న కామెంట్లు చేశారు. అయితే సమ్రాట్ వైవాహిక జీవితంలో ఎన్ని కష్టాలు ఎదుర్కున్నారో అందరికీ తెలిసిందే. మొదటి భార్యతో విడాకులు పొందేందుకు ఆయన పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. అయితే ఆమెత విడాకుల తర్వాత.. కరోనా ఫస్ట్ వేవ్ అనంతరం సామ్రాట్ శ్రీలిఖితను వివాహం చేసుకున్నాడు.

కరోనా కారణంగా అతి తక్కువ మంది సమక్షంలో పెళ్లి జరిగినప్పటికీ… హైదరాబాద్ లో గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేశాడు. అప్పటి నుంచి తన భార్యతో చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే సామ్రాట్ తండ్రి కాబోతున్నట్లు తెలుసుకున్న బిగ్ బాస్ కంటెస్టెంట్లు శ్యామల, శివజ్యోతి వంటి వాళ్లు కూడా కంగ్రాట్స్ చెబుతున్నారు.
AdvertisementView this post on Instagram
Read Also : Anchor suma: రెండు గంటలకు అంత రెమ్యునరేషనా.. సుమ ఏమాత్రం తగ్గట్లేదుగా!
- Intinti Gruhalakshmi Aug 18 Today Episode : రెస్టారెంట్లో ఎంజాయ్ చేస్తున్న తులసి,సామ్రాట్.. కోపంతో రగిలిపోతున్న నందు..?
- Intinti Gruhalakshmi Aug 17 Today Episode : తులసి కోసం కొట్టుకున్న నందు,సామ్రాట్.. టెన్షన్ పడుతున్న తులసి..?
- Intinti Gruhalakshmi serial Sep 7 Today Episode : అభి,అంకితను విడిపోమని చెప్పిన గాయత్రి.. తులసి పై కోపంతో రగిలిపోతున్న సామ్రాట్..?













