Rupee falls : రూపాయి పడిపోతూనే ఉంది. మరింతగా దిగజారుతూనే ఉంది. రికార్డు స్థాయిలో పడిపోయింది రూపాయి. డాలర్ తో పోలిస్తే ఎన్నడూ లేని రీతిలో పడిపోతూ సామాన్యుల నుండి సంపన్నుల వరకు ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపుతోంది. రూపాయి పడిపోవడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతుంది. ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది. దీని వల్ల పప్పులు, ఉప్పులు, గ్యాస్ సహా అన్నింటి ధరలు పెరిగిపోతాయి. వచ్చే ఆదాయం ఏమాత్రం పెరగకపోగా… ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి. ఆదాయం, ఖర్చు మధ్య అంతరం పెరిగిపోయి… సేవింగ్స్ ఏమీ లేకుండా పోతాయి. కుటుంబ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతుంది.
రూపాయి పతనం వల్ల ఏయే వస్తువుల ధరలు పెరుగుతాయో ఇప్పుడు చూద్దాం.
ఆర్థిక నిపుణులు చెబుతున్నా దాని ప్రకారం.. రూపాయి పడిపోవడం వల్ల దిగుమతులపై ప్రభావం పడుతుంది. పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు పెరిగిపోతాయి. విదేశాల్లో చదువుకోవడం కూడా మరింత భారంగా మారనుంది. దిగుమతి చేసుకునే ప్రతి వస్తువు కూడా భారంగా మారుతుంది.
పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి. క్రీములు, లోషన్లు, వ్యాసిలిన్ సహా చాలా వాటి ధరలు పెరుగుతాయి. అలాగే విదేశాల నుండి దేశానికి వచ్చే బంగారం ధరలు కూడా పెరుగుతాయి. ల్యాప్ టాప్ లు, మొబైన్ ఫోన్లు, కార్లు, ఆటో పార్టులు సహా ఇతర ఎక్విప్ మెంట్లు ఖరీదు అవుతాయి.