Intinti Gruhalakshmi july 11 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో ప్రేమ్, రక్షిత్ లు ఫైనల్ కి చేరుకుంటారు.
ఈరోజు ఎపిసోడ్ లో ప్రేమ్ రక్షితుల మధ్య పోటీ హోరాహోరీగా సాగుతుంది. ఆ తర్వాత విజేతను ప్రకటించే అవకాశం ఆడియన్స్ చేతుల్లోనే ఉంది. ఆడియన్స్ వారికి ఇష్టమైన కంటెస్టెంట్ కి ఓటు వేసి గెలిపించుకోవచ్చు. ఎవరికైతే ఎక్కువ ఓట్లు వస్తాయో వారు గెలుస్తారు అని చెప్పగా ఒక్క ఓటు తేడాతో ప్రేమ గెలుస్తాడు. కొడుకు గెలవడంతో తులసి సంతోషానికి అవధులు లేకుండా పోతాయి.
ఇక నందు కూడా కొడుకు గెలవడంతో సంతోష పడుతూ ఉండగా అది చూసి లాస్య కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడు లాస్య నందుని ఎవరికి ఓటు వేశావు అని ఫోన్ చెక్ చేయబోతూ ఉండగా నేను ప్రేమ్ కీ ఓటు వేశాను, నేను వాడి కన్నతండ్రిని నచ్చని పని చేస్తే కోప్పడతాను నచ్చిన పని చేస్తే నెత్తినెక్కించుకుంటా వాడు చాలా బాగా పాడాడు అని అనడంతో లాస్య కోపంతో రగిలిపోతూ ఉంటుంది.
Intinti Gruhalakshmi : తులసీని గెలిచింది అని ఒప్పుకున్న నందు..
ఆ తర్వాత ప్రేమ్ గెలుపు కారణము ఎవరు అని అడగగా తులసి అని చెబుతూ తులసిని గొప్పగా పొగుడుతాడు. ఆ తర్వాత శృతి గురించి మాట్లాడుతూ తన గెలుపులో సగభాగం శృతి ఇదే అని చెబుతూ ఎమోషనల్ అవుతాడు. ఆ తర్వాత ట్రోఫీని తనకు కాకుండా తన తల్లి తులసికి ఇవ్వమని కొడతాడు ప్రేమ్. ఆ తర్వాత తులసి నన్ను ఒక పెద్ద మనిషి తల్లిగా ఓడిపోయాను నింద వేశారు ఆయన ఇప్పుడు ఇక్కడే ఉన్నారు.
ఇప్పటికి నేను ఓడిపోయాను అనిపిస్తే స్టేజ్ మీదకు వచ్చి అందరి ముందు చెప్పాల్సిందిగా కోరుతున్నాను అని అనడంతో వెంటనే ఆ మాటలకు లాస్య నందుని మరింత దెప్పిపొడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత తల్లి, బిడ్డల బంధం గురించి గొప్పగా చెబుతుంది. ఇంతలో నందు ప్రేమ్ దగ్గరికి వెళ్లి నీ గొప్పతనం ఈరోజు తెలుసుకున్న కంగ్రాట్స్ ఫ్రేమ్ తండ్రిగా ఓడిపోయాను మీ అమ్మే గెలిచింది అని అనడంతో నందు వైపు అలా చూస్తూ ఉంటుంది.
అప్పుడు నందు అవునన్నా మీ అమ్మనే గెలిచింది నేను నిన్ను బాధ పెట్టే విధంగా మాట్లాడాను ఆ మాటలను వెనక్కి తీసుకుంటున్నా అని అంటాడు నందు. అప్పుడు ప్రేమ తండ్రిగా మీకు అనే హక్కు ఉంది పడాల్సిన బాధ్యత నాపై ఉంది కానీ అమ్మ మూలంగా చెడిపోయాను అని అన్నారు కదా ఆ మాట తట్టుకోలేకపోయాను ఇంకెప్పుడు అలా అనకండి నాన్న అని అంటాడు ప్రేమ్. అప్పుడు పరం దామయ్య అలా అన్నందుకే కదరా నీలో పట్టుదల పెరిగింది థాంక్స్ అని చెప్పు అని అంటాడు.
మరొకవైపు లాస్య,నందు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడు నందు రావడంతో లాస్య కావాలనే వెటకారంగా మాట్లాడుతుంది. అప్పుడు లాస్య తన కోపం లక్కీ పై చూపిస్తుంది. మరొకవైపు తులసి బొమ్మల వైపు చూస్తూ మురిసిపోతూ ఉంటుంది. ఆ తర్వాత అక్కడికి అనసూయ, పరంధామయ్య ఎక్కడికి వస్తారు. అప్పుడు తులసి వారితో ప్రేమ గురించి మాట్లాడుతూ సంతోష పడుతూ ఉంటుంది. మరుసటి రోజు ఉదయం తులసి కుటుంబం మొత్తం జాతరకు వెళ్తారు. అక్కడ అనసూయ, పరంధామయ్య ను వెటకారంగా మాట్లాడుతుంది.